Friday, November 22, 2024

HYD: ఆటోమేటిక్ ఫ్రంట్-లోడ్ వాషింగ్ మెషీన్‌ల కొత్త శ్రేణిని ఆవిష్కరించిన శాంసంగ్

హైదరాబాద్‌ : శాంసంగ్ భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, ఏఐ ఎకోబబుల్ టీఎం పూర్తి ఆటోమేటిక్ ఫ్రంట్-లోడ్ వాషింగ్ మెషీన్‌ల కొత్త శ్రేణిని ఆవిష్కరించింది. ఈ కొత్త శ్రేణి వాషింగ్ మెషీన్‌లు 11 కిలోల విభాగంలో ఏఐ వాష్, క్యూ-డ్రైవ్ టీఎం అండ్ ఆటో డిస్పెన్స్ వంటి అధునాతన ఫీచర్‌లతో వచ్చిన మొదటి ఉత్పత్తి, ఇవి మీ లాండ్రీని 50శాతం వేగంగా చేయడానికి, 45.5శాతం మెరుగైన ఫాబ్రిక్ సంరక్షణను అందిస్తాయి.

70శాతం ఎక్కువ శక్తి-సమర్థవంతమైనది. ఈసంద‌ర్భంగా శాంసంగ్ ఇండియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పుష్ప్ సౌరభ్ బైషాఖియా మాట్లాడుతూ… స్థిరమైన, సహజమైన సాంకేతికతను పరిచయం చేయడంపై కంపెనీ దృష్టిని నొక్కి చెప్పారు. 11 కిలోల పూర్తి ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌ల కొత్త శ్రేణి విభిన్న వినియోగదారుల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి రూపొందించబడిందన్నారు. లాండ్రీ పనులను సులభతరం చేయడానికి ఆటో డిస్పెన్స్, ఏఐ వాష్ అండ్ క్యూ -డ్రైవ్ వంటి ఫీచర్లను అందిస్తోందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement