హైదరాబాద్, ఆంధ్రప్రభ : హర్ గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని ప్రతి ఇంటిపై 13 నుంచి 15 వరకు మూడు రంగుల జాతీయ జెండా ఎగురవేసేందుకు పోస్టల్ శాఖ తన వంతు కృషి చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని పోస్టాఫీసుల్లో జెండాలను ఒక్కోటి రూ.25కు విక్రయించనున్నట్లు తెలిపింది.
ఈ మేరకు హైదరాబాద్ రీజియన్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కార్యలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందుకుగాను ఇప్పటికే రాష్ట్రంలోని 6214 పోస్టాఫీసులకు 7లక్షల50వేల జెండాలను సరఫరాచేసినట్లు వెల్లడించింది.
- Advertisement -
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.