హైదరాబాద్, : నెల మొదటి పనిదినంనాడే రిజర్వ్‌బ్యాంకు ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకుఖాతాల్లో వేత నాలను జమ చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో ముం దడుగేస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి కూడా ప్రతి నెలా మొదటి తేదీనే జీతాలు చెల్లించేలా సర్కార్ కార్యాచరణ చేస్తున్నది. అనేక శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం నెలకొంటోంది. వేతనాల చెల్లింపుల్లో మరింత సరళ విధానాలను అవలంభిస్తోంది. ఒక్కోసారి 6 నెలలకుపైగా జీతాలు అందని పరస్థితి ఉందని ప్రభుత్వం గుర్తించి వారి సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తోంది.
గతంలో ఉన్న అనేక అవరోధాలు అధిగమించేందుకు ఆధునిక పారదర్శక విధానాలు అందుబాటులోకి తెస్తూ ఉద్యోగ ఫ్రెండ్లీ సర్కార్‌గా తెలంగాణ ప్రభుత్వం ఖ్యాతిగడి స్తోంది. ఈ మేరకు ఖజానా శాఖ కాగిత రహిత సేవలను ఆమ లులోకి తేవడంద్వారా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఐఎఫ్‌ఎంఐఎన్ పోర్టల్‌ను అందుబా టులో తెచ్చింది. శాఖల వారీగా ఉద్యోగుల వివరాలు ఈ పోర్ట ల్లో నమోదు చేయనున్నారు. ఈ ప్రక్రియతో బిల్లుల సమ ర్పణ, చెల్లింపుల వంటి అన్ని వివరాలు ఉండనున్నాయి. జిల్లాల్లో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన కాగిత బిల్లులను కార్యాలయాల్లో అందజేస్తేనే ”ఈ-కుబేర్” విధానంలో వేతనాలు చెల్లిస్తున్నారు. ”ఈ-కుబేర్” రాక తర్వాత ప్రతి నెలా ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందుతున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు ప్రస్తుతం అ వలంభిస్తున్న విధానాన్ని ”ఈ-కుబేర్”తో పూర్తిగా మార్చి వేసిన ప్రభుత్వం తాజాగా ఈ విధానంలో మరిన్ని సంస్కర ణలను తీసుకొస్తోంది. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం(ఐఎఫ్ఎంఐఎస్) ద్వారా ప్రతి శాఖకు ప్రత్యేకంగా యూజర్ నేం, పాస్ వర్డ్ అమలులోకి తెచ్చారు. ఈ యూజర్ నేమ్‌తో పూర్తి వివరాలను పొందుపర్చారు. ఉద్యోగి పూర్తి పేరు, తొలి పోస్టింగ్, డిపార్ట్మెంట్, గతంలో ఎక్కడెక్కడ విధులు నిర్వహించారు, పదోన్నతుల వివరాలు, ప్రస్తుతం పనిచేస్తున్న స్థానం, ప్రాంతం వివరాలను ఈ పోర్ట ల్లో నమోదు చేశారు. పూర్తి సమగ్ర సమాచారంతోపాటు పాన్‌కార్డు, ఆధార్‌కార్డు వివరాలు పొందుపర్చినట్లు ఖజానా శాఖ వెల్లడించింది. పూర్తి చేసిన మొత్తం వివరాలను ఆన్లైన్ ద్వారా డీటీవో (జిల్లా ట్రెజరీ అధికారి)కి అందించారు.
ఇక మీదట రాష్ట్రంలోని 4 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యో గులు, పెన్షనర్లకు కాగిత బిల్లులతో పనిలేకుండా పోనున్నది. కొత్త పోర్టల్ అందుబాటుతో జిల్లాల్లో ఖజానా కార్యాలయాల కు పూర్తిగా పేపర్‌లెస్ పాలన అందుబాటులోకి రానున్నది. ఈ ప్రక్రియ వేగవంతం చేసేందుకు అన్ని శాఖల డ్రాయింగ్ అధికారులకు కొత్త పోర్టల్ లాగిన్ సౌకర్యం కల్పించారు. ఈ పోర్టల్‌లో ఉద్యోగుల వివరాలను నిక్షిప్తం చేస్తున్నారు. ఈ నెల లోనే పూర్తిస్థాయిలో మొత్తం ఉద్యోగులు, పెన్షనర్ల వివరాలు నమోదు చేసి వచ్చే నెల నుంచి పేపర్‌లెస్ బిల్లుల ద్వారా ఆన్ లైన్ వేతనాల అందజేతకు సన్నాహాలు చేస్తున్నారు.
గతేడాదిగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయు లకు రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నేరుగా వేతనాలు ఖాతాలో జమ చేస్తున్నారు. ఎస్బీఐ ద్వారా వేతనాలను చెల్లిం పులను ”ఈ-కుబేర్” రాక తర్వాత పూర్తిగా నిలిపివేసింది. కేం ద్ర ప్రభుత్వ సూచనల మేరకు ”ఈ-కుబేర్”ను రాష్ట్ర ప్రభు త్వం అమలులోకి తెచ్చింది. ఈ విధానానికి పూర్వం డీడీవో లు ట్రెజరీలో సమర్పించిన బిల్లులను ట్రెజరీ అధికారులు ఆడి ట్ చేసి బ్యాంకుకు పంపేవారు. బిల్లులు బ్యాంకుకు చేరాయా లేదా అనే అంశం డీడీవోలు పరిశీలించి బ్యాంకుకు వెళ్లి నిర్దా రణ చేసుకునేవారు. ట్రెజరీ అధికారులు ఇచ్చిన టోకెన్‌ను బ్యాంకులో సమర్పించాకే వేతనాలు ఖాతాల్లో జమ అయ్యే వి. ”ఈ-కుబేర్” రాకతో డీడీవోలు, ట్రెజరీలో బిల్లులు సమర్పి స్తున్నారు. ట్రెజరీ అధికారులు వాటిని ఆడిట్ చేసి నేరుగా ఆర్బీఐకి పంపిస్తున్నారు. దీంతో బ్యాంకుల చుట్టూ తిరిగే బాధ తప్పిపోయింది. డబుల్ ఆథరైజేషన్ ఒకేసారి చేయ డంతో నెలలో మొదటి పనిదినంనాడే ఉద్యోగుల వేతనాలు క్రెడిట్ అవుతున్నాయి.
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వేతన సవ రణ వర్తించనుంది. 30శాతం వేతన సవరణ వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మూలవేతనం, హెచ్ ఆర్ఏ, డీఏ వంటివి కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే ఉంటాయి. దీంతో ఫిట్మెంట్ అమలుపై సందిగ్ధత నెలకొంది.
కాంట్రాక్ట్ ఉద్యోగులకూ ఒకటినే జీతం….
Advertisement
తాజా వార్తలు
Advertisement