Tuesday, November 19, 2024

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ యాక్టింగ్ ఛైర్మ‌న్ గా సాయిలు..

హైదరాబాద్‌, : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌ టీఎస్సీ) యాక్టింగ్‌ చైర్మన్‌గా సాయిలును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాయిలు చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం టీఎస్‌ పీఎస్సీలో సాయులు ఒక్కరే సభ్యులుగా ఉన్నారు. ఆయనే చైర్మన్‌ కావడంతో ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీలో ఆల్‌ ఇన్‌ వన్‌ కానున్నారు. సాయిలు పదవీకాలం కూడా అక్టోబర్‌లో ముగి యనుంది. డిసెంబర్‌ నుంచి కేవలం ఇద్దరితో మాత్రమే కొనసా గుతున్న సర్వీస్‌ కమిషన్‌లో యాక్టింగ్‌ చైర్మన్‌గా వ్యవహరిం చిన కృష్ణారెడ్డి గత నెల 18న రిటైర్‌ అయ్యారు. దీంతో ఒక్క స భ్యుడే మిగిలారు. వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సిద్ధమ వుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో కమిషన్‌కు సభ్యులు లేక పోవడంతో పలు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇం తకాలం కమిషన్‌లో ఉన్న చైర్మన్‌ ఘంటా చక్రపాణి, ముగ్గురు సభ్యులు విఠల్‌, చంద్రావతి, మతీనుద్దీన్‌ ఖాద్రీల పదవీకాలం గత డిసెంబర్‌లో ముగిసింది. టీఎస్‌పీఎస్సీ యాక్టు ప్రకారం చైర్మన్‌తో పాటు గరిష్టంగా పది మంది దాకా సభ్యులు ఉం డాలి. అయితే సభ్యుల పదవీకాలం ముగియడంతో ఇటీవల చైర్మన్‌తో పాటు ముగ్గురు సభ్యులను కొత్తగా నియమించేందు కు నిర్ణయం జరిగినట్లు సమాచారం. టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీంద్రరెడ్డి, మరో సభ్యుడిగా సీఎస్‌ సోమేష్‌ కుమార్‌కు సన్నిహితుడిగా ఉండే లక్ష్మీనారాయణ పేరు విని పిస్తోంది. ఈ ముగ్గురు సభ్యులతో పాటు రిటైర్‌ ఐపీఎస్‌ నవీన్‌ చంద్‌ను చైర్మన్‌గా నియమించేందుకు ఫైల్‌ను సిద్ధం చేసినా.. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో తాత్కాలికంగా నిలిచిపోయినట్లు తెలిసింది. వాస్తవంగా ఫిబ్రవరిలోనే సభ్యుల నియామకం చేసేందుకు ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ రావడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండడంతో ప్రభుత్వం ఇందుకు సం బంధించి ఫైల్‌ను పక్కన పెట్టిందంటున్నారు. తాజాగా నాగా ర్జునసాగర్‌ ఉపఎన్నిక షెడ్యూల్‌ రావడంతో ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని ఈ నియామకాలను పూర్తి చేయాలనుకు న్నప్పటికీ గవర్నర్‌ బ్రేక్‌ వేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబు తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల భర్తీపై ఫైల్‌ సిద్ధం చేస్తున్న నేపథ్యంల టీఎస్‌పీఎస్సీకి పాలకవర్గం లేకపో వడం కొంత ఇబ్బందికరమే. అయితే పరిస్థితులెలా ఉన్నా తా త్కాలిక చైర్మన్‌గా సాయులును నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఆయనను యాక్టింగ్‌ చైర్మన్‌ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆ రెండు కమిషన్లు..
తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌గా బీఎస్‌ రాములు పని చేశా రు. 2016 నుంచి 2019 వరకు ఆయన ఆ పదవిలో ఉన్నారు. ఏడాదికి పైగా ఈ పదవి ఖాళీ. రాములుతో పాటు మరో ముగ్గు రు సభ్యులను రీ అపాయింట్‌ చేస్తారన్న ప్రచారం ఉంది. అయి తే రాములు ఎమ్మెల్సీ ఆశిస్తున్నట్లు ప్రచారముంది. మరో రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ పదవీ కాలం ముగిసింది. ఈ కమిషన్‌ చైర్మన్‌గా శ్రీనివాస్‌ పనిచేశారు. ఆయనకు సుదీర్ఘకాలం టీఆర్‌ఎస్‌తో అనుబంధం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement