భారత దేశంలోని హిమాలయాల్లో అత్యంత ఎత్తైన శిఖరాలలోని లదక్ లోని 6270 మీటర్ల ఎత్తున ఉన్న kang yatse 2 పర్వత శిఖరం, దోజో జొంగో పర్వత శిఖరం 6240 ఎత్తు గల రెండు పర్వత శిఖరాలను కేవలం 70 గంటలలో అతి చిన్న వయసులో 11 జూలైన మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ పడకంటి విశ్వనాథ్ కార్తికేయ 13వ సంవత్సరంలోనే అవరోధించడం జరిగింది. ఇంతకు ముందు 2021లో రష్యా లోని టెరాస్కాల్ (Terascall) 2022లో నేపాల్ లో మౌంట్ నగర్షాంగ్ నేపాల్
(mount nagarshang Nepal)లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ 2022 లొ ఇండియాలో ఫ్రెడ్షిప్ పార్క్ (friendship peak) అవరోదిచడం జరిగింది.
బాలానగర్ వాసి పడకంటి శివకుమార్ సౌమ్య లక్ష్మిల మనమడు రాజేంద్ర ప్రసాద్ లక్ష్మిల కుమారుడు ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన సందర్భంగా వారి నివాసం దగ్గర తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్, ఐవీఎఫ్ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పార్సి ప్రకాష్ గుప్తా, ప్రధాన కార్యదర్శి ఉప్పల చంద్రశేఖర్, కోశాధికారి దారం సతీష్ గుప్తా, పీఆర్ఓ పోకల శ్రవణ్ లతో కలవడం జరిగింది. ఇంకా మున్ముందు ఇలాంటి శిఖరాలను అధిరోహించి మన తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ పేరును విశ్వవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి గర్వకారణంగా నిలవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదించడం జరిగింది.