Saturday, November 23, 2024

అభివృద్ధి పనులలో నాణ్యత కరువు..

ఉప్పల్ : ఉప్పల్‌లోని పారిశ్రామిక వాడలో జరుగుతున్న అభివృద్ధి పనులలో నాణ్యత కరువైంది. పారిశ్రామిక వాడలో సేవరేజ్‌ వాటర్‌ డ్రైన్‌ నిర్మాణం, దానిపై రోడ్డు నిర్మాణ పనులకు మొత్తం రూ.5 కోట్లతో ప్రారంభించారు. అయితే వర్షపునీరు పోయేందుకు వాటర్‌ డ్రైన్‌, మ్యాన్‌హోల్‌ నిర్మాణ పనులను సదరు కాంట్రాక్టర్‌ ఎటువంటి నాణ్యత ప్రమాణాలు లేకుండా చేపడుతున్నారు. మొదట చేపట్టిన వాటర్‌ డ్రైన్‌ పనులలో ఇసుకకు బదులుగా నాసిరకమైన కంకర పొడిని వినియోగిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ మాత్రం పనులు జరుగుతున్న ప్రాంతంలో కనిపించడం లేదు. అభివృద్ధి పనులపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నాసిరకమైన పనులను చేపట్టడం వలన ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అభివృద్ధి పనులలో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement