సుప్రసిద్ధ మార్కెటింగ్ స్ట్రాటజీ కన్సల్టెన్సీ ఆర్ఎంటీ (రెడ్ మ్యాటర్ టెక్నాలజీస్) తమ నూతన నివేదిక అండర్స్టాండింగ్ పెయిడ్ ఓటీటీ సబ్‌స్ర్కైబర్స్ ఆఫ్ హైదరాబాద్ ను విడుదల చేసింది. ఈ నివేదికలో హైదరాబాదీల ఓటీటీ వీక్షణ అలవాట్లను వెల్లడించారు. ఇంటర్నెట్పై చురుకుగా ఉన్న, ఇంటర్నెట్ సబ్‌స్ర్కిప్షన్‌పై ఖర్చు చేస్తున్న మరీ ముఖ్యంగా వర్కింగ్ గ్రూప్ వీక్షకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ నివేదిక వెల్లడించే దాని ప్రకారం 77శాతం మంది ఉద్యోగాలు లేదంటే సొంత వ్యాపారాలు చేస్తున్న వారు మాత్రమే గాక, సరాసరిన నెలకు 60 వేల రూపాయలు ఆర్జిస్తున్నవారున్నారు.
ఈ నివేదిక వెల్లడించే దాని ప్రకారం, 26 ఏళ్ల లోపు వ్యక్తులు ఓటీటీని ఒంటరిగా వీక్షించాలనుకుంటున్నారు. పెద్ద వయసు అంటే 35 సంవత్సరాల లోపు వ్యక్తులు 55శాతం మంది కుటుంబంతో కలిసి టీవీ చూడాలనుకుంటున్నారు. ఆర్ఎంటీ సీఈఓ శ్రీకాంత్ రాజశేఖరుని మాట్లాడుతూ… మన రోజువారీ జీవితాల్లో ఓటీటీలు అంతర్భాగమయ్యాయన్నారు. వినియోగదారుల ప్రాధాన్యతలను తెలుసుకుని తదనుగుణంగా కంటెంట్‌ను ఓటీటీలు సృష్టించడం కీలకమన్నారు. ఆర్ఎంటీ వద్ద ఇన్సైట్స్ హెడ్ అమన్ మాట్లాడుతూ… ఈ నివేదికలోని అంశాలతో వ్యాపార సంస్ధలు మరింతగా లక్ష్యిత కంటెంట్ సృష్టించగలవన్నారు.