Friday, November 22, 2024

కె యు విద్యార్ధి ఆత్మ‌హ‌త్య ప్ర‌భుత్వ హ‌త్యే – రేవంత్ రెడ్డి…

హైద‌రాబాద్ – మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ సింగ్ తండాకు చెందిన 25 ఏళ్ల సునీల్.. ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లు ఇక రావని కలత గత నెల 26న హన్మకొండలో పురుగుల మందు తాగగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయాడు.. అయితే, ఈ ఘటనపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి స్పిందిస్తూ, విద్యార్థి సునీల్ నాయక్ ది ప్రభుత్వ హత్యేనని ఆన్నారు. . కేసీఆర్ అండ్ కో ఉద్యమ సమయంలో విద్యార్థులను రెచ్చగొట్టి చావులకు కారణమయ్యారని.. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వక మరోసారి వాళ్ల చావులకు కారణమవుతున్నారని మండిపడ్డారు.. కేసీఆర్ కుటుంబ వైభోగం కోసం యువత ఇంకెన్నాళ్లు బలిదానాలు చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. రాష్ట్రంలో లక్షా 91 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ చెప్పిందని.. కానీ, ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన టీఎస్పీఎస్సీ కమిటీకే దిక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి 27 నెలలైనా నిరుద్యోగ భృతి అతీగతీ లేదని రేవంత్ టిఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై మండి ప‌డ్డారు. మ‌ర‌ణించిన విద్యార్ధి సునీల్ కుటుంబానికి త‌గిన న‌ష్ట‌ప‌రిహారంతో పాటు వారి కుటుంబంలోని వారికి ఉద్యోగం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. తక్షణం లక్షా 91 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని.. ఏప్రిల్ నెల నుంచే నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement