కర్మన్ ఘాట్, ఆగస్టు 9 (ప్రభ న్యూస్) : హస్తినాపురం డివిజన్ మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని ధాతు నగర్, సాయి గణేష్ నగర్ మీదుగా వర్షపు నీటి కాలువ నిర్మించడంతో రోడ్లన్నీ గుంతల మయంగా మారాయని, ఈ పనులను వెంటనే చేపట్టాలని స్థానిక కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ మీర్పేట్ డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి అధికారులను కోరారు. హస్తినాపురం డివిజన్ పరిధిలోని దాతునగర్, సాయి గణేష్ నగర్ మీదుగా నిర్మించిన వర్షపు నీటి కాలువ నిర్మాణం చేపట్టడం వల్ల అక్కడ కొన్ని రోడ్లు దెబ్బతినడం జరిగిందన్నారు. ముఖ్యంగా మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో ఉండే తిరుమల నగర్ కాలనీతో పాటు జిహెచ్ఎంసి పరిధిలో ఉండే సాయి గణేష్ నగర్, దత్త నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా గుంతల మయం కావడంతో స్థానిక కాలనీవాసులు నాయకుల విజ్ఞప్తి మేరకు మీర్పేట్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ వాణితో కలిసి హస్తినాపురం కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్ బుధవారం ఆయా కాలనీలో పర్యటించారు.
ఈ సందర్భంగా అక్కడ దెబ్బతిన్న రోడ్లను వెనువెంటనే మరమ్మతులు చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీర్పేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, మీర్పేట్ కార్పొరేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, జిహెచ్ఎంసి అసిస్టెంట్ ఇంజనీర్ హేమో నాయక్, బారాస నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, విద్యాధర బట్టు శివకుమార్, మేకల యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.