ప్రపంచ అధిక రక్తపోటు దినం (హైపర్ టెన్షన్ డే) సందర్భంగా కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) తెలంగాణా చాప్టర్ తో భాగస్వామ్యం చేసుకుని గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ (జీజీహెచ్) హైదరాబాద్ ఓ అధ్యయనాన్ని విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు సమక్షంలో కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణా చాప్టర్ జాయింట్ సెక్రటరీ డా.సాయి సుధాకర్ ఈ అధ్యయన ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ చాప్టర్ అధ్యక్షులు డా.రాజీవ్ గార్గ్ మాట్లాడుతూ.. ఈసారి తాము 25నుంచి 50 సంవత్సరాల్లోపు వయసు కలిగిన వ్యక్తులను పరీక్షించామన్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారి జీవనశైలిని విశ్లేషించినప్పుడు ఆహారపు అలవాట్లు, పొగతాగడం, ఒత్తిడి స్థాయిలు వంటివి హైపర్ టెన్షన్ కు ప్రధానంగా తోడ్పాటునందిస్తున్నాయన్నారు. గ్లెనిగల్ గ్లోబల్ హాస్పిటల్స్ హైదరాబాద్ క్లస్టర్ సీఓఓ డా.రియాజ్ ఖాన్ మాట్లాడుతూ… ఇటీవలి కాలంలో ప్రతిష్టాత్మకమైన వ్యక్తులైన సీఈఓలు, నటులు, రాజకీయ వేత్తలు, క్రీడాకారులు ఇలా చాలా మంది ఆకస్మాత్తుగా మరణించడం చూశామన్నారు. అయితే ఈ అధ్యయన ఫలితాల విశ్లేషణలో వెల్లడైన అంశమేమిటంటే గతంలో హైదరాబాద్ లో 25శాతం మంది మధుమేహ రోగులుంటే ఇప్పుడు వారి సంఖ్య 33శాతంకు చేరుకుందన్నారు. ఐహెచ్ హెచ్ హెల్త్ కేర్ ఇండియా గ్రూప్ సీఈఓ అనురాగ్ యాదవ్ మాట్లాడుతూ… అంతర్జాతీయంగా 20శాతం మంది హైపర్ టెన్షన్ బారిన పడేందుకు అవకాశాలుండగా.. పలు అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం దేశంలో 22శాతం నుంచి 27శాతంగా ఉండొచ్చని చెబుతున్నాయన్నారు. ఈ అధ్యయనంపై హైపర్ టెన్షన్ పట్ల అవగాహనను భారీ స్థాయిలో కల్పించేందుకు ప్రయత్నించనున్నట్లు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement