ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఎన్నికల ఫలితాలకు ముందు, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవడానికి, తప్పుడు సమాచారం, నకిలీ వార్తలను అరికట్టడానికి వినియోగదారులకు అవగాహన కల్పించడానికి కూ యాప్ ఒక అడ్వైజరీని విడుదల చేసింది. అడ్వైజరీతో పాటు, కూ తన కమ్యూనిటీ మార్గదర్శకాలను కూడా ప్లాట్‌ఫారమ్ అందుబాటులో ఉన్న మొత్తం 10 భాషల్లో విడుదల చేసింది. ఈసందర్భంగా కూ CEO, సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ… మాతృభాషలలో స్వీయ-వ్యక్తీకరణకు సామాజిక వేదికగా, తాము క్రియేటర్లను, సృజనాత్మకత, ఆవిష్కరణలను పెంపొందించడానికి ఆన్‌లైన్‌లో మరింత సమగ్రమైన విధానాన్ని అవలంబించేలా యూజర్లను శక్తివంతం చేస్తామన్నారు. కీలకమైన సంఘటనల ముందు తప్పుడు సమాచారం ప్రధాన ఆందోళన అని, ఈ సలహా ద్వారా కూ ఒక బాధ్యతాయుతమైన ప్లాట్‌ఫాంగా – ఫేక్ న్యూస్ మరియు దుర్మార్గపు వ్యాప్తిని నియంత్రించడంలో సహాయపడుతుందన్నారు. అలాగే ఎక్కువ ఆన్‌లైన్ భద్రత, పారదర్శకతను ప్రచారం చేస్తుందన్నారు. అడ్వైజరీ యూజర్లను ప్రోత్సహిస్తుందన్నారు. ముఖ్యంగా మొదటిసారి యూజర్లు ఆన్‌లైన్‌లో మరింత అర్థవంతమైన సంభాషణలను రూపొందించడానికి సాంకేతికతను సానుకూలంగా, గౌరవప్రదంగా ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తుందన్నారు. యూజర్లకు సురక్షితమైన, లీనమయ్యే అనుభవాన్ని అందించేందుకు నిరంతర ప్రాతిపదికన ఉత్తమ అభ్యాసాలను గుర్తించడానికి కూ ప్రయత్నిస్తుందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital