ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా చినజీయర్ స్వామిపై మండిపడ్డారు. ఆదివాసీ ఆరాధ్య దైవాలు సమ్మక్క సారమ్మలను కించపరుస్తూ మాట్లాడిన చినజీయర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రూపం లేకపోయినా ఆదివాసీ వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలను కోట్లాదిమంది కొలుస్తున్నారన్నారు. ఆదివాసీ గూడేలలో చినజీయర్ దిష్టిబొమ్మలను తగులబెట్టాలని రేగా కాంతారావు పిలుపిచ్చారు. చినజీయర్లా మోసం చేయడం తమ జాతికి తెలియదన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital