హైదరాబాద్, : పచ్చని పొలాల్లో.. రియల్ వెం చర్లు దర్శనిమిస్తున్నాయి. ఎక్కడికక్కడ పంట పొలాలను రి యల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లుగా మార్చేస్తున్నారు. దీంతో గ్రామాల్లోని పంట భూములు అన్నీ రోరోజుకి వెంచర్లుగా మా రి గుంటల నుంచి గజాల్లోకి మారుతున్నాయి వెరసి పంట భూ ములు తగ్గుతున్న పరిస్థితి ఏర్పడింది. నానాటికీ పెరుగు తున్న జనాభాకు నివాస యోగ్యమైన ప్రదేశాలు లేకపోతే ప్రజలకు ఇబ్బందులు ఉంటాయన్నది వాస్తవమే.. ఇదే సమయంలో.. పంట పొలాలను వెంచర్లుగా మార్చడం వలన పెరుగుతు న్న జనాభాకు అవసరమైన ఆహారాన్ని అందించేందుకు పం డించ డానికి భూములు ఉండవన్నది మరొక నిజం. ఒక్క భూ మిని రెండు విధాలుగా ఉపయోగించుకునే క్రమంలో లాభంతో పాటు నష్టం కూడా ఉందంటున్నారు సామాజిక కార్యకర్తలు.
భూముల ధరలు పెరగడంతో…
గతంలో జిల్లా కేంద్రాలకు దగ్గరలోని పొలాలన్నీ పంటల తో కళకళలాడేవి. కానీ నేడు ఆ పొలాలన్నీ ప్లాట్లుగా మారి ఇళ్లు నిర్మించుకునేందుకు వీలుగా మరాయి. పట్టణ ప్రాంతాల్లో కాలుష్యం పెరుగుతుందన్న కారణంతో ప్రజలంతా శివారు ప్రాంతాల్లో ఉండేందుకు ఆసక్తి చూపించడంతో వ్యాపారులు ఆ ప్రాంతాల్లోని భూములను కొనుగోలు చేసి అంతస్తులు నిర్మి స్తున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లోని భూములకు ధర ల రెక్కలొచ్చాయి. దీంతో రైతులు కూడా వ్యవసాయం చేస్తే ఎ న్ని సంవత్సరాలు కష్టపడినా సంపాదించలేమన్న ఆలోచనతో వ్యాపారులు అడిగిందే తడువుగా భూములు విక్రయిస్తు న్నారు. దీంతో పట్టణ, గ్రామ తేడా లేకుండా ఎక్కడికక్కడ పంట భూములన్నీ వెంచ్లర్లుగా మారుతున్నాయి.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం జోరుగా వ్యాపారం సాగిస్తుండడంతో వ్యాపారులు పోటీ పడి మరి భూములు కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారుల పోటీతత్వంతో రైతులకు కాసుల పంట పండుతున్నప్పటికీ.. పండే భూములు విక్రయిస్తే భవిష్యత్ పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. దేశంతో పాటు రాష్ట్రంలో జనన, మరణ అంశాలను పరిగణలోకి తీసుకుంటే మరణించే వారి కంటే కూడా జన్మించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోజురోజుకి పెరుగుతున్న జనాభా కోసం నివాస ప్రాంతాలు ఎంత అవసరమో.. అదే స్థాయిలో పంట పండే భూములూ అవసరమే. కానీ మనుషులు పెరుగుతున్న విధంగా భూమి పెరగదు కనుక ఇపుడున్న పంట పొలాల్లో వెంచర్లు వేస్తే భవిష్యత్ తరాల్లో వ్యవసాయం కష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయం జరగకపోతే.. మానవా ళికి అవసరమైన ఆహారాన్ని దిగుమతి చేసుకోవడంతో పాటు నిత్యావసరాలకు ధరలు అమాంతం పెరిగి.. సామాన్యుడు జీవించే పరిస్థితి ఉండదు.
హైవేలు.. విమానాశ్రయాల దగ్గర ఎకరం కోటి.. హైవేలు, విమానాశ్రయాలు ఏర్పాటవుతున్న ప్రాంతాల్లో అయితే ఎకరం కోటికి పైగా పలుకుతుంది. అయితే ధర ఎక్కువ పలకడం రైతుకు లాభంగా కనిపించినా.. ఇది భవిష్యత్‌కు మాత్రం ప్రమాదమేనని పలువురు సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు.
ప్రస్తుతం ఖమ్మం జిల్లాతో పాటు.. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ముమ్మరంగా నడుస్తుం డడంతో ఆయా జిల్లా కేంద్రాలకు దగ్గరలో ఉన్న భూములన్నీ ఇప్పటికే వ్యాపారుల చేతిలోకి వెళ్లాయి. దీంతో పాటు సూర్యా పేట నుంచి ఆంధ్రా ప్రాంతానికి వెళ్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవేకు పక్కనున్న గ్రామాల్లోని భూములకు విపరీతంగా ధరలు పెరగడంతో రైతులు వ్యవసాయం చేయడానికంటే కూడా విక్రయించేందుకే మొగ్గు చూపుతుండడం గమనార్హం.
రియల్ అడ్డాగా హైదరాబాద్- విజయవాడ హైవే..
ఓ పది.. పదిహేనేండ్ల క్రితం హైదరాబాద్-విజయవాడ హైవే పక్కన పొలాలన్నీ పచ్చని పంటలతో దర్శనమిచ్చేవి. ప్రధానంగా హైదరాబాద్ శివారు భూముల్లో ద్రాక్ష తోటలు విరివిగా ఉండేవి. కానీ పెరిగిన జనాభాతో ఆ హైవే పక్కన ప్రస్తుతం కంటికి కనిపించిన మేరకు ప్లాట్లుగా మారిన భూములే దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో పాటు.. అన్ని రంగాల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతున్న సమయంలో రియల్ వ్యాపారం జోరుగా నడుస్తోంది. హైదరాబాద్- విజయవాడ హైవే అడ్డాగా రియల్ వ్యాపారం జోరుగా నడుస్తుండగా.. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగే క్రయ, విక్రయాల అంశాల్లో చర్చలు జరుగుతుంటాయి.
వ్యవసాయంలో అభివృద్ధి లేదని…
ఎన్నో ఏండ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నప్పటికీ.. వ్యవసాయంలో అభివృద్ధి లేకపోవడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న కొద్ది సాయం సరిపడా లేకపోవడం ఒకవైపైతే.. వాతా వరణ ప్రతికూలతలతో సాగు చేయలేకపోతున్నామని అందుకే ఇష్టం లేకపోయినా కుటుంబాలకు కాపాడుకునేందుకు భూములు అమ్ముకుంటున్నామని రైతు ఒకరు చెప్పారు.
పెరుగుతున్న టెక్నాలజీ రైతులకు సరైన స్థాయిలో ఉపయోగపడక పోవడంతో వ్యవసాయం భారమవుతున్న నేపథ్యంలోనే పంట భూములు అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. జరుగుతున్న అభివృద్ధి మంచికోసమే అయినా.. తగ్గుతున్న పంట భూములు మాత్రం రాబోయే తరాలకు ఆహారాన్ని అందించలేవన్న నమ్మలేని నిజం మనకు స్పష్టంగా కనిపిస్తోంది.