హైదరాబాద్ : జార్ఖండ్ నుంచి ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి బలహీనపడింది. నైరుతి మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ క్రమంలో రాగల మూడు రోజుల్లో రాష్ర్టంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు, సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement