వేసవి కాలం ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో తీవ్రస్థాయిలో ఎండలున్నాయి. అయితే ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దుండిగల్, అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల, మేడ్చల్ ఏరియాల్లో వడగళ్ల వాన కురుస్తోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వర్షం మరో 45 నిమిషాల పాటు కొనసాగే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. సంగారెడ్డి పరిధిలోని సదాశివపేట్ – ఝూరాసంఘం ప్రాంతంలో కూడా కుండపోత వర్షం కురుస్తోంది. మరో 30 నిమిషాల పాటు వర్షం కొనసాగే అవకాశముంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement