హైదరాబాద్ నగరం ఐదురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తడిసి ముద్దయ్యింది. మరో 12 గంటల్లో నగర వ్యాప్తంగా బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ఈరోజు రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు బలమైన గాలులు వీస్తాయని, చెట్లు కూలే అవకాశముందని తెలిపింది. చెట్ల కింద ఎవరూ ఉండొద్దని వార్నింగ్ ఇచ్చింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఎమర్జెన్సీ కోసం NDRF బృందాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ముంపు ప్రాంతాలను అధికారులు అలర్ట్ చేశారు. మరో రెండు, మూడు రోజులపాటు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని జీహెచ్ఎంసీ తెలిపింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.