Friday, November 22, 2024

TIQ: బయోఏషియా 2024లో మెరిసిన క్వీన్స్‌లాండ్‌

హైదరాబాద్‌ : క్వీన్స్‌లాండ్‌ ప్రభుత్వ అంకితమైన వ్యాపార సంస్థ అయిన ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ క్వీన్స్‌ల్యాండ్‌ (టీ-ఐక్యూ), బయోఏషియా 2024కి గ్లోబల్‌ స్పాన్సర్‌గా పాల్గొనడం ద్వారా పొందిన అద్భుతమైన ప్రతిస్పందనను వెల్లడించింది. లైఫ్‌ సైన్సెస్‌ పరిశ్రమ, ఆరోగ్య సంరక్షణ రంగంలోని ఇతర కంపెనీలతో చర్చలు, సంభావ్య భాగస్వామ్యాలను అన్వేషించడం కోసం ఈ సదస్సు తోడ్పడింది. టీ-ఐక్యూ నేతృత్వంలో, 8 మంది క్వీన్స్‌ల్యాండ్‌ పరిశోధకులు, కంపెనీల ప్రతినిధి బృందం సదస్సులో పాల్గొంది.

ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ క్వీన్స్‌ల్యాండ్‌ దక్షిణాసియా సీనియర్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కమీషనర్‌ అభినవ్‌ భాటియా మాట్లాడుతూ…. బయోఏషియా 2024లో తమ భాగస్వామ్యం ఉమ్మడి పరిశోధన, మొదటి దశ క్లినికల్‌ ట్రయల్స్‌, ఉమ్మడి ఔషధ ఆవిష్కరణల ద్వారా ప్రపంచ భాగస్వామ్యాలను ప్రోత్సహించడంలో క్వీన్స్‌లాండ్‌ అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. క్వీన్స్‌ల్యాండ్‌ ప్రతినిధి బృందంలో అడ్వాన్స్‌డ్‌ నానో-స్ట్రక్చర్డ్‌ మెటీ-రియల్స్‌, ప్రెసిషన్‌ నానోమెడిసిన్‌, బయోమానుఫ్యాక్చరింగ్‌లో తన మార్గదర్శక పరిశోధనకు ప్రసిద్ధి చెందిన ప్రొఫెసర్‌ అలాన్‌ రోవాన్‌, క్వీన్స్‌ల్యాండ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ లో డైరెక్టరేట్‌ గ్రోత్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ హెడ్‌ తమన్నా మోనెమ్‌, ప్రొఫెసర్‌ ప్రసాద్‌ యార్లగడ్డ, యూనివర్శిటీ- ఆఫ్‌ సదరన్‌ క్వీన్స్‌లాండ్‌ లో ఇంజినీరింగ్‌ డీన్‌, ప్రొఫెసర్‌ ఎలిజా వైట్‌సైడ్‌, యునిఎస్‌ క్యూ హెడ్‌ (పరిశోధ), జీ2 ఓఎంఈ కన్సల్టింగ్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడైన డా.ఆనంద్‌ గౌతమ్‌ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement