భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన, రెండుసార్లు ఒలంపిక్ మెడలిస్ట్, ప్రపంచ విజేత, అయిన ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి, పద్మ భూషణ్ పురస్కార గ్రహీత పి.వి.సింధు ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ (ఎల్విపిఇఐ) నిర్వహిస్తున్న వైటథాన్ రన్‌లో పాల్గొనే వారు ధరించనున్న టీ-షర్ట్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ కోచ్, వైటథాన్‌కు సుదీర్ఘకాలంగా మద్దతుదారు అయిన వివిఎస్ లక్ష్మణ్ వీడియో సందేశాన్ని అందించారు. వైటథాన్ రన్ అనేది రెటినోబ్లాస్టొమా (కంటి కాన్సర్)తో బాధపడుతున్న పిల్లల పట్ల సమాజంలో అవగాహన పెంచడం, చికిత్సకు అవసరమైన నిధులను సేకరించడానికి ఎల్విపిఇఐ నిర్వహిస్తున్నటువంటి ఒక లక్ష్య-సంబంధితమైన పరుగు. వైటథాన్ రన్ నాలుగవ ఎడిషన్ 2022 మే 8వ తేదీన హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ రన్‌కు హైదరాబాద్ రన్నర్స్ మద్దతునిసున్నది. ఈసందర్భంగా ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆపరేషన్ ఐసైట్ యూనివర్సల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఐ కాన్సర్ అధిపతి, ఆక్యులర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్వాతి కలికి మాట్లాడుతూ… వైటథాన్ టీ-షర్ట్ ఆవిష్కరణకు గౌరవ అతిధిగా వచ్చినందుకు పి.వి.సింధుకు తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రారంభం నుండి ఈ రన్‌కు మద్దతునిస్తున్నందుకు, రెటినోబ్లాస్టొమా గురించిన అవగాహన విస్తరించడంలో తమకు సహాయపడుతున్నందుకు వివిఎస్ లక్ష్మణ్‌కు కూడా తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement