బుక్ ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్‌పై ప్రశంసల వర్షం
హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : మేధావులు, పాఠకులు, కవులు, కవయిత్రులు, కవులు, గద్య కవులు, అవధాన కవులు, అభ్యుదయ కవులు, రచయితలు, నవలా రచయితలు, ఆధ్యాత్మిక రచయితలు, విప్లవ కవులు, పండితులు, అధ్యాపకులు, ఆచార్యులు, విద్యార్థులు, ప్రేక్షకులు, నాటకప్రియులు, రసజ్ఞులు వేలాదిమందితో 8వ రోజు కూడా ఎన్టీఆర్ స్టేడియం పుస్తక ప్రదర్శన కిటకిటలాడింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నూతనోత్సాహమిస్తూ పుస్తక ప్రదర్శన ప్రారంభించిన నాటి నుండి, కీరవాణి, త్రివిక్రమ్ శ్రీనివాస్, అఫ్సర్, సతీష్ చందర్, ముదిగొండ శివప్రసాద్, సన్నిధానం నరసింహశర్మ, గోరటి వెంకన్న, నందిని సిధారెడ్డి, ఎం.వేణుగోపాల్, మామిడి హరికృష్ణ, పురాణపండ శ్రీనివాస్, అల్లం నారాయణ వంటి ప్రముఖులు ఎందరో గంటలకొద్దీ ఈ బుక్ ఫెయిర్‌లో మెరిసి, బుక్స్ కొనుగోలు కేసుని వెళ్లడం గమనార్హం.
ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి నిర్మించిన శ్రీఅమృతేశ్వర ఆలయం ప్రచురించిన పరమాద్భుతమైన శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణపత్య గ్రంథాలను పరమసౌందర్యంగా ఒక ఫైల్‌లో పెట్టి ఎందరో రచయితలు, కవులు, ప్రచురణకర్తలకు బహూకరించడం విశేషం.
ఈ పవిత్ర ఆధ్యాత్మిక విశేష వైభవాలను చాటిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కృషిని అందరూ ప్రశంసిస్తున్నారు. పుస్తక మాంత్రికుడుగా తెలుగు రాష్ట్రాల్లో విశేషఖ్యాతి సంపాదించుకుని, వేలాది అభిమానుల్ని సంపాదించుకున్న పురాణపండ శ్రీనివాస్ అందించిన వేంకాటాచల క్షేత్ర వెలుగుల గ్రంథం ‘‘అదివో.. అల్లదివో’’ ఈ బుక్ ఫెయిర్‌లో వేలాది మనసుల్ని కొల్లగొట్టింది.
పురాణపండ శ్రీనివాస్ పరమ శోభాయమాన గ్రంథాలతో వారాహి చలనచిత్రం శ్రీఅమృతేశ్వర దేవస్థానం సంయుక్తంగా అందించిన వందలాది స్పిరిట్యూయల్ ఫైల్స్ ఈ బుక్ ఫెయిర్‌లో టాక్ ఆఫ్ ది బుక్ ఫెయిర్‌గా నిలిచాయి. యాకూబ్ వంటి కవి ప్రముఖుడు ఈసారి బుక్ ఫెయిర్‌కి అధ్యక్షునిగా ఉండటం వల్ల ఎందరో కవులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని, ఎన్నో గ్రంథావిష్కరణలు జరిగాయని పలువురు పేర్కొంటున్నారు.
వారంరోజులుగా ఆవుల మంజులత, పద్మినీ ప్రియదర్శిని, శీలా సుభద్రాదేవి, ఐనంపూడి లక్ష్మి, రోహిణి వంజారి, మానస ఎండ్లూరి, మెర్సీ మార్గరెట్, జ్యోతి వల్లబోజు, చంగల్వల కామేశ్వరి, కల్పన తదితరులు బుక్ ఫెయిర్‌లో పాల్గొని కవిత్వాన్ని సాహిత్యాన్ని వెదజల్లడం ఎంతోమందిని ఆకట్టుకుంది.