హైదరాబాద్ : యుగయుగాల అనాది సనాతనధర్మంలోని అనేక అద్భుతాలను శాస్త్ర ప్రమాణాల సమన్వయంతో అపురూప రచనా సంకలనాల అద్భుత గ్రంథాలుగా అందిస్తున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్, గణపతి నవరాత్రుల సందర్భంగా అందించిన మహా గాణపత్యగ్రంథం గణానాంత్వా సాధికారిక విలువలతో అందించడం అభినందనీయమని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. విఖ్యాత వైద్యసేవల సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య సౌజన్యంతో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోని పలు గణపతి నవరాత్రోత్సవ వేదికలపై వైదిక వినాయక మంత్రమయ జ్ఞాపికగా అనేక మంది విజ్ఞులకు అందించడం విశేషమని రాజకీయ, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు.
తిరుమల వేంకటాచల క్షేత్రం ప్రధానార్చకులు ఏ.వేణుగోపాలదీక్షితులు, జస్టిస్ కాశీవిశ్వేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కుమారుడు ఆనం శుభకర్‌రెడ్డి, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డా.అనంతలక్ష్మి, ప్రముఖ రాజకీయవేత్తలు జక్కంపూడి విజయలక్ష్మి, జక్కంపూడి రాజా, ఆరామ ద్రావిడ బ్రాహ్మణ సంఘ ప్రముఖులు ఆకుండి సూర్య తదితర ప్రముఖుల వందల ప్రతులు వితరణ చేయడం, ఆయా ప్రాంతాల్లో ఈ పవిత్ర గ్రంథం విశేషంగా ఆకట్టు-కోవడం పట్ల విశ్వహిందూ పరిషత్, ఆరెస్సెస్ రాష్ట్రనాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయస్థాయి ఖ్యాతినొందిన ఖైరతాబాద్ గణపతి అనుగ్రహంతో ఖైరతాబాద్ మహా గణేష్ కమిటీ- చైర్మన్ రాజ్‌కుమార్, ఈ రెండు గ్రంథాలను దర్శనానికి విచ్చేసే ప్రముఖులకు స్వయంగా అందివ్వడం గమనార్హం.
అద్భుతాలు, మంగళాలు, వరాలు, సౌందర్యాల్ని విరజిమ్మే విఘ్నేశ్వరుని సంచికలతో ప్రతీఏటా సంచలనం సృష్టిస్తున్న శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్, ఇంతటి పవిత్ర ఘనకార్యానికి వెనుక బొల్లినేని కృష్ణయ్య, కల్కి దర్శకుడు నాగ్‌అశ్విన్ తల్లిదండ్రులు జయంతి రెడ్డి, జయరామిరెడ్డి మాత్రమే కాకుండా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆప్తుడిగా పేరొందిన వారాహి చలనచిత్ర అధినేత సాయి కొర్రపాటి సద్భక్తితో ఈ మంత్రకార్యానికి సమర్పకులుగా వ్యవహరించడాన్ని సినీ రాజకీయ పండిత ప్రముఖులు పూర్వజన్మ సుకృతంగా పేర్కొంటున్నారు.