హైదరాబాద్: తెలంగాణలోని అన్ని నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ఏప్రిల్ 30లోపు 2021-22 సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లించేవారికి 5 శాతం రాయితీని కల్పిస్తూ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 141 పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి పన్ను రాయితీ ని ఎక్కువమంది వినియోగించుకునేలా విస్తృత ప్రచారం చేపట్టాలని పురపాలకశాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. రాయితీ నేపథ్యంలో ఆస్తిపన్ను వసూళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే ఈ అవకాశాన్ని ఇంటి పన్నుదారులు వినియోగించుకోవాలని కోరారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement