Friday, November 22, 2024

తెలంగాణలో క్రీడలకు ప్రోత్సాహం : ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్త‌

హైదరాబాద్ లోని బండ్లగూడ, నాగోల్, వి-స్పోర్ట్స్ అకాడమీలో (ఇండోర్,అవుట్ డోర్ గేమ్స్) ఫ్రెండ్స్ క్లబ్ ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఫ్రెండ్స్ కప్-2023 ఇంటర్ క్లబ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వ‌హించారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న “ఫ్రెండ్స్ కప్-2023” ఇంటర్ క్లబ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో తెలంగాణ లోని పలు జిల్లాల బ్యాడ్మింటన్ క్రీడాకారులు పాల్గొననున్నారు. టోర్న‌మెంట్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త ముఖ్య అతిధిగా హాజ‌రై ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్తకు నిర్వాహ‌కులు బోకే ఇచ్చి, శాలువతో సన్మానించి, స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత స్పోర్ట్స్ కి, క్రీడాకారులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో, నియోజకవర్గ కేంద్రాల్లో స్పోర్ట్స్ స్టేడియంలు కూడా నిర్మిస్తున్నారని అన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. స్పోర్స్ కోటాలో ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వ‌రంగ‌ల్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి , రంగారెడ్డి జిల్లా కార్యదర్శి శ్రీనివాస రావు, రమేష్, ఏసీపీ వెంకట్ రావు, మానకొండూరు జ‌డ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement