Thursday, November 14, 2024

ప్రజలు సమస్యలపై ముందస్తు చర్యలు..

‌కంటోన్మెంట్‌ : కంటోన్మెంట్‌ 3వ వార్డులో ప్రజలు సమస్యల భారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెరాసా యువజన విభాగం నాయకుడు బి సాయికిరణ్‌ తెలిపారు. గురువారం వార్డు పరిధిలోని కార్కానాలో 16లక్షల రూపాయలతో అభివృద్ది పరుస్తున్న భూగర్భ డ్రైనేజీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సాయికిరణ్‌ మాట్లాడుతూ కార్కానా బస్తీలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడం లో భాగంగా అధిక సామార్ద్యం కలిగిన భూగర్భడ్రైనేజీ పైప్‌లైన్‌ నిర్మాణ పనులను చేపట్టేందుకు తన తల్లి అని తా ప్రభాకర్‌ గత 3నెలల క్రితం బోర్డు సభ్యురాలిగా కొనసాగిన సమయంలో 16లక్షల నిధులను మంజూరు చేయించి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఆ పనుల్లో ఎలాంటి నాన్యత లోపించకుండా ప్రతీనిత్యం వాటిని పర్యవేక్షిస్తూ శాశ్వతంగా నిలిచేలా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాబోయే వర్షాకాలంలో కార్కానా ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆధునీకపరమైన ప్రతిపాదనలతో రూపొందించిన డ్రైనేజీ పై ప్‌లైన్‌ నిర్మాణ పనులను శాశ్వతంగా ఉండేందుకు గాను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ వేసవిలో త్రాగునీరు, రోడ్లు, పారిశుధ్యం, తదితర సమస్యలు తలెత్తకుండా ఎప్పడికప్పుడు సమస్యలను తెలుసుకుంటు వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement