హైదరాబాద్, : కరోనా మరణమృదంగాన్ని మోగిస్తోంది. కేసుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండగా, మరణించేవారి సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది. కరోనా విస్తృతి, కేసుల పెరుగుదలతో ప్రైవేట్ ఆస్పత్రులలోని బెడ్లన్నీ ఫుల్ కాగా, వీటిపై పర్యవేక్షణ లేకపోవడంతో లెక్కకు మించి.. సామర్థ్యానికి మించి అనధికారిక వార్డులు ఏర్పాటు చేసి పేషెంట్లను తీసుకుంటూ లక్షలు సొమ్ము చేసుకుంటు న్నాయి. ప్రధాన ఆస్పత్రుల్లో బెడ్లు నిండాయి. ప్రతిరోజూ 3వేలకు పైగా కేసులు అధికారికంగా నమోదవుతుండగా, ఇందుకు పదిరెట్లకు పైగా పాజిటివ్‌లు గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్నారని వైద్యశాఖ వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. టెస్టింగ్‌పై నిర్బంధం ఒత్తిడి లేకపోవడం, ట్రేసింగ్ అసలే లేక పోవడంతో కేసుల విజృంభణ కొనసాగుతోంది. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లో అనధికార బెడ్ల దందా కొనసాగుతోంది. కొన్ని ఆస్పత్రులు నిబంధనల ప్రకారం వ్యవహరిస్తుండగా, మరి కొన్ని ఆస్పత్రులు దొరికింది ఛాన్స్ అనుకుంటూ లక్షల బిల్లులు వసూలు చేస్తున్నాయి. తాజా కరోనా భయాలు, బెడ్ల కొరత ప్రచారం నేపథ్యంలో కొందరు అడ్వాన్స్‌లు చెల్లించి బెడ్లను బ్లాక్ చేస్తుండగా.. మరికొందరు బ్లాక్ మార్కెట్ తరహాలో రూ.3 నుండి రూ.5 లక్షల వరకు అడ్వాన్స్ చెల్లిస్తే బెడ్ ఇప్పి స్తామంటూ ప్రాణాపాయం ఉన్న స్థితిలో ప్రజల ఆరోగ్యంతో బేరసారాలు ఆడుతున్నారు. కేసుల సంఖ్య జిల్లాలకు, హైదరా బాద్ కేంద్రంగా ఇస్తున్న బులెటిన్లకు వ్యత్యాసం ఉంటుండగా, లెక్కకు రాని మరణాల సంఖ్య భారీగా ఉంటుందన్న ఆరోప ణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులలో అనధికార బెడ్లు.. ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేయగా లెక్కలో లేని పాజిటివ్‌ల మరణాలు కూడా లెక్కలోకి రాకుండా పోతున్నా యని ప్రైవేట్ ఆస్పత్రుల బాధిత సంఘం నేతలు చెబుతు న్నారు. సీరియస్ కేసులు ఆఖరి నిమిషంలో చేతులెత్తేసి గాంధీకి పంపుతున్నారని ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో 50మందికి పైగా ఇలాంటి మరణాలు జరిగాయని, నేరుగా మృతదేహాలు స్మశానవాటికలకు వెళ్తున్నాయని ఆరోపణలున్నాయి. ఇటీవల గాంధీలో ఒకేరోజు 35మంది మృతి చెందారని, ఒకేరోజు 17మంది మృతి చెందారని ప్రచారాలు జరగ్గా.. ఇపుడు టెస్టింగ్, ట్రేసింగ్, కేసుల సంఖ్యే కాదు మరణాలకు కూడా లెక్కలేదన్న ఆందోళన వివిధ సంఘాల నుండి వ్యక్తమవుతోంది.
లెక్కల్లో 50శాతం ఫుల్
ప్రైవేట్‌లో మొత్తం 16,485 బెడ్లు ఉండగా.. ఇందులో 7502 బెడ్లు ఫుల్ అయ్యాయని, మిగతా బెడ్లు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. హైదరాబాద్ నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో 80శాతానికి పైగా బెడ్లు ఫుల్ అయినట్లు చెబుతున్నారు. ప్రధాన ఆస్పత్రులకు బెడ్లకోసం ప్రయత్నిస్తే.. ప్రతిచోటా నో బెడ్స్ అనే సమాధానం వినిపిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులలో బెడ్ల స్థితి.. అధికారిక లెక్కల ప్రకారం..
ఆస్పత్రి పేరు మొత్తం నిండినవి ఖాళీలు బెడ్లు
అపోలో, హైదర్‌గూడ 40 40 0
కిమ్స్, సికింద్రాబాద్ 98 96 2
కేర్, బంజారాహిల్స్ 80 71 9
ఎఐజి, గచ్చిబౌలి 200 196 4
ఓమ్ని, కొత్తపేట 50 50 0