Friday, November 22, 2024

TVS: త‌ల్లిదండ్రులు, మామ‌య్య ప్రోత్సాహంతోనే టీవీఎస్ మోటార్స్ లో ఇంజినీర్ గా ఎదిగా.. ప్రేమ్ కుమార్

హైదరాబాద్‌ : తన తల్లిదండ్రులు, మామయ్యల ప్రోత్సాహంతోనే తాను ఉన్నత స్థితికి చేరుకున్నానని టీవీఎస్‌ మోటార్స్‌లో డేటా ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రేమ్‌ కుమార్‌ తెలిపారు. తమ కుటుంబాల జీవనోపాధికోసం వారు ఎండ, వానల్లో అవిశ్రాంతంగా పని చేయడం కళ్లారా చూస్తూ పెరిగానని ఆయన తెలిపారు. ఫాదర్స్‌ డేను పురస్కరించుకొని ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. సాధారణ దిగువ మధ్యతరగతి కుటుgబం నుండి వచ్చానని, తమ నాన్న రైతు, అమ్మ గృహిణి అని తెలిపారు. గ్రేట్‌ లెర్నింగ్‌ నుండి ఏఐ, ఎంఎల్‌లో పీజీ డిప్లొమాని పూర్తి చేశానన్నారు. దీనికి ముందు గోకరాజు రంగరాజు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీలో బీటెక్‌ పూర్తి చేసినట్లు తెలిపారు. తనకు మొత్తం 2.3 సంవత్సరాల వర్క్‌ ఎక్స్‌పీ రియన్స్‌ ఉందని తెలిపారు. తన రోల్‌ -టె-స్ట్‌ డేటా మేనేజ్‌మెంట్‌ కోసం సొల్యూషన్స్‌ అందించడంతో పాటు పెర్ఫార్మెన్స్‌ టెస్టింగ్‌లో పనిచేశానన్నారు. తాను గ్రేట్‌ లెర్నింగ్స్‌ కోర్సును కనుగొనే ముందు వ్యవసాయరంగానికి ఉపయోగకరమైన సాధనాలను రూపొందించే లక్ష్యంతో యూట్యూబ్‌ వంటి వివిధ ఆన్‌లైన్‌ వనరుల ద్వారా తన అభ్యాస ప్రయా ణాన్ని ప్రారంభించానని తెలిపారు. తాను గ్రేట్‌ లెర్నింగ్‌ మెషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అప్‌ స్కిల్లింగ్‌ కోర్సుకోసం సైన్‌అప్‌ చేయడా నికి ఎంచుకున్నానని, కోర్సు ప్లాన్‌ సరైన దిగా, సులభంగా అర్థం చేసుకునేలా ఇంటరాక్టివ్‌గా ఉందన్నారు.

ఈ కోర్సులో ముందుగా రికార్డ్‌ చేయబడిన వీడియోలు, సందేహ నివృత్తి ప్రయోజనాల కోసం వారాంతాల్లో రెండు గంటల ప్రత్యక్ష ప్రసార తరగతులున్నాయన్నారు. ప్రతి వారం నేర్చుకోవడం కోసం కొత్త మాడ్యూల్‌ విడుదల చేయబడిందని, ఇందులో మాడ్యూల్‌ కంటెట్‌ ఆధారంగా క్విజ్‌లు, ప్రాజెక్ట్‌లు ఉంటాయన్నారు. ఈ కోర్సు అన్ని ప్రాథమిక నుండి ఇంటర్మీడియట్‌ స్థాయి అంశాలకు సంబంధిం చిందన్నారు. రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో, అధునాతన టెక్నాలజీ ప్రవేశం కారణంగా టెక్‌షెల్ఫ్‌ జీవితం గణనీయంగా తగ్గిపోయింది. కాబట్టి, వాడుకలో లేకుండా ఉండేందుకు టెక్‌లో నైపుణ్యం చాలా కీలకంగా మారిందన్నారు. సాధారణంగా అందించే డేటా సైంటిస్ట్‌, డేటా అనలిస్ట్‌ లేదా ఎంఎల్‌ ఇంజనీర్‌ వంటి అధిక ప్యాకేజీ జీతాలుగల రోల్స్‌లో స్థానం పొందే అవకాశాలను పెంచుతుందన్నారు. అదనంగా, ఈ కోర్సు ఎంఎల్‌ డొమైన్‌లో ఫ్రీలాన్స్‌ వర్క్‌ చేయడానికి తమకు వీలు కల్పిస్తుందన్నారు. నేడు కంపెనీలు బహుళ టెక్నాలజీలతో పని చేయగల అభ్యర్థుల కోసం వెతుకుతున్నా యన్నారు. కొత్త సాంకేతికతలతో మనల్ని మనం పెంచుకోవడం వల్ల కెరీర్‌ని నిర్మించుకోవడంతో పాటు మంచివేతనం పొందడంలో సహాయపడుతుందన్నారు. ప్రత్యేకించి చాట్‌ జీపీటీ వంటి కొత్త టెక్నాలజీల ఆవిర్భావంతో కేవలం అకడమిక్‌ శిక్షణతో, పరిశ్రమలో శిక్షణ లేకపోవడంతో కార్పొరేట్‌ ప్రపంచంలోకి ప్రవేశించడం సరిపోదని, తమ కెరీర్‌ లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించే ప్రతిష్టాత్మక నిపుణులకు అప్‌ స్కిల్లింగ్‌ అనేది నిస్సందేహంగా కీలకంగా ఉండాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement