గర్భిణీ మహిళలు వైద్యుల సలహాలు తీసుకొని టీకాలు తీసుకోవాలని కిమ్స్ ఆసుపత్రి కన్సల్టెంట్ యూరోగైనకాలజిస్టు డాక్టర్ బిందుప్రియ తెలిపారు. ఆమె మాట్లాడుతూ…..మన దేశంలో సోమవారం ఉదయానికి 1.80 లక్షల కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయయ్యాన్నారు. దీని వ్యాప్తిరేటు డెల్టా కంటే చాలా ఎక్కువగా ఉందని, కేసులు రెట్టింపు కావడానికి పట్టే సమయం బాగా తగ్గుతోందన్నారు. అయితే కరోనా ఉధృతి, ఒమిక్రాన్ తీవ్రత, గర్భిణులపై అదిచూపే ప్రభావం, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆమె వవరిస్తూ…. గర్భిణులూ కొవిడ్ నుంచి తమను తాము కాపాడుకోడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముక్కు, నోరు మూసి ఉంచేలా మాస్కు ధరించాలని, చేతిశుభ్రత పాటించి, తరచూ మీ చేతులను సబ్బు లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలన్నారు. కనీసం 2 అడుగుల భౌతిక దూరం పాటించాలన్నారు. రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లొద్దని, అనవసర ప్రయాణాలు, ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణాలు వాయిదా వేసుకుని, తగినంత గాలి, వెలుతురు తగిలేలా ఇంట్లోనే ఉండాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు కొవిడ్ టీకా తీసుకోవాలని, పోషకాహారం, తగినంత నీరు తీసుకోవాలన్నారు.
ఇతర కొవిడ్ లక్షణాల్లాగే జ్వరం, జలుబు, గొంతునొప్పి, దగ్గు, ఊపిరి అందకపోవడం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి మరేదైనా అనారోగ్యంగా ఉంటే వెంటనే మీ వైద్యులను సంప్రదించాలన్నారు. అలాగే ఆస్పత్రికి వెళ్లేటట్లయితే అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ఇబ్బందులు అంతగా లేనివారైతే టెలిమెడిసిన్ సేవలనూ ఉపయోగించుకోవచ్చన్నారు. పిల్లలకు పాలిచ్చే తల్లులు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటూ పాలివ్వడం కొనసాగించాలన్నారు. ప్రసవానికి ముందు ఇంటికి ఎక్కువ మందిని రానివ్వకూడదన్నారు. కేవలం కుటుంబసభ్యులకే పరిమితమై.. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం పాజిటివ్ వచ్చినా తల్లులు పిల్లలకు పాలివ్వవచ్చని.. తల్లి పాల ద్వారా వైరస్ వ్యాపించదన్నారు. గర్భిణులు టీకాలు తీసుకోవడంపై అనేక అపోహలు, దురభిప్రాయాలున్నాయని, అయితే గర్భిణులపై టీకాలకు సంబంధించిన ప్రయోగాలు ఇంతవరకు జరగలేదన్నారు. ఈ ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ బారి నుంచి గర్భిణులను రక్షించడానికి ఇప్పటివరకు ఉన్న ఏకైక మార్గం టీకానే అని, పాలిచ్చే తల్లులకూ ఇది సురక్షితమేనని వెల్లడైందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital