30 శాతం పైగా ఉండే అవకాశం
ఉద్యోగ రిటైర్మెంట్ వయో పరిమితి 61 ఏళ్లకు
సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పింఛన్
అసెంబ్లీ వేదికపై ప్రకటన యోచన
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో ఉద్యోగులపై నమ్మకం
హైదరాబాద్, : సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. ఎంప్లాయి ఫ్రెండ్లీ సర్కార్‌గా పేరున్న తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 22న శాసన సభా వేదికగా కీలక నిర్ణయాలను ప్రకటించనుం ది. ఈ మేరకు సీఎం కేసీఆర్ సిద్ధమైనట్లు తెలి సింది. రెండేళ్లుగా ఉద్యోగులు వేచిచూస్తున్న సమస్యలకు సీఎం కేసీఆర్ తనదైన శైలిలో శుభ వార్త వినిపించనున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు 30శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రక టించనున్నారని, ఇందుకు సోమవారం శాసన సభలో ఆయన బడ్జెట్‌పై సాధారణ చర్చలో భాగంగా సమాధానంలో లేదంటే ప్రత్యేక ప్రకటన చేయనున్నారని విశ్వసనీ యంగా తెలిసింది. 2021-22 బడ్జెట్‌పై సాధారణ చర్చ శనివారం ప్రా రంభమైంది. ఈ చర్చలో భాగంగా పలువురు విపక్ష, స్వపక్ష సభ్యులు మాట్లాడారు. దీనిపై సోమవారం మధ్యాహ్నం తర్వాత సీఎం కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు. సభ్యులు లేవనెత్తిన అనేక అనుమానా లు, ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సవివర సమాధానం ఇవ్వనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్ని కల్లో విజయం సాధించి ఊపుమీదున్న టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ నెల 9న ఉద్యోగ సంఘాలకిచ్చిన మాటను నిలబెట్టుకోనుంది. ఉద్యో గులు, ఉపాధ్యాయులు పూర్తిగా సహకరించడంతోనే సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడంతోపాటు, బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని తమ ఖాతాలో వేసు కోవడం సాధ్యమైందని సీఎం కేసీఆర్‌కు ఇంటెలిజెన్స్‌తోపాటు, పలు మార్గాల్లో సమాచారం అందింది. ఎన్నికలకు ముందు టీజీవో, టీఎ న్జీవో, సీపీఎస్, సచివాలయ ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యోగుల సంఘం, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు టీఆర్‌ఎస్‌కు తమ బహి రంగ మద్దతు ప్రకటించాయి. ఎన్నికల ప్రచారంలో కూడా జోరుగా పాల్గొన్నాయి. సీఎం కేసీఆర్‌తో ఈనెల 9న ఎన్నికలకు ముందు భేటీ అయిన తర్వాత తమ మద్దతు టీఆర్‌ఎస్‌కేనని, పీఆర్సీ ప్రకటించను న్నారని ఓపెన్‌గా చెప్పాయి. దీంతో ఎన్నికల సంఘం నుంచి నోటీసుల ను కూడా అందుకోవాల్సి వచ్చింది. వీటన్నింటినీ పరిగణలోకి తీసు కున్న ప్రభుత్వం ఉద్యోగుల త్యాగాలకు గుర్తుగా 30శాతంపైనే పీఆర్సీ ఫిట్‌మెంట్‌తోపాటు, సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పింఛన్ పథకం, ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితి పెంపు 61ఏళ్లకు పెంపు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం(సీజీహెచ్‌ఎస్) తరహాలో తెలంగా ణ ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎస్)లో ప్రతి నెలా ఉద్యోగుల వేతనాల నుంచి కొంత మొత్తం వసూలు చేసి మెరుగైన ఆరోగ్య పథ కం, అన్‌లిమిటెడ్‌గా అమలు చేసే పథకం ప్రకటించనున్నారని సమా చారం. రెండోసారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తమ డిమాండ్లు నెర వేరుతాయని ఉద్యోగులు ఆశతో ఉన్నారు. పీఆర్‌సీ ప్రకటన, ఉద్యో గుల వయో పరిమితి పెంపు అంశాలపై ప్రతి నెలా చర్చ జరుగు తూ వచ్చింది. ఈ ఏడాది జనవరి నెలలో 1200 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయగా, ఫిబ్రవరిలో మరో 1000 మంది పదవీ విరమణ చేశారు. ఈ నెలలో 1200 మంది రిటైర్ కానున్నారు.
ఇతర రాష్ట్రాల్లో పదవీ విరమణ వయసు పెంపు
ఆంధ్రప్రదేశ్‌లో సర్కార్ ఉద్యోగులకిచ్చిన హామీ మేరకు పదవీ విరమణ వయసును గత మూడేళ్ల క్రితమే 60 ఏళ్లకు పెంచింది. కర్ణాటకలో రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లుగా అమలవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఈ హామీని నెరవేర్చితే ప్రభుత్వంపై పడే భారం, ఉద్యోగుల సంఖ్య, ఎన్నేళ్లు ఇది భరించాలి అనే అంశంపై ప్రభుత్వం స్పష్టతకు వచ్చింది. దేశంలోనే అత్యధిక పీఆర్‌సీ ఫిట్‌మెంట్ ఇవ్వాలనే తన లక్ష్యాన్ని కూడా శాసనసభా వేదికగా సీఎం కేసీఆర్ స్పష్టం చేయనున్నారు. అయితే ఆర్థిక పరిస్థితిని కూడా సమూలంగా ఈ సందర్భంగా వివరించనున్నారు