హైదరాబాద్, : రాష్ట్ర ఉద్యోగులకు వేతన సవరణ క్లియరెన్స్ వచ్చింది. సీఎం పేషీకి చేరిన ఫైల్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. దీనిలో ప్రధానంగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. వేతన సవరణ కమిషన్ సూచించినట్లుగానే వేతనాల పెంపు, కనీస వేతనాన్ని అమలు చేసేందుకు ఆమోదం తెలిపారు. అయితే ప్రతి ఏడాది రూ.1000 ఇంక్రిమెంట్ ఇచ్చే అంశంపైనే క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ అమలు కానుంది. ఈ నెల 10న వేతన సవరణకు ఆర్థిక శాఖ ఒకే చెప్పి సీఎం సంతకం కోసం ఫైల్‌ను పంపించారు. ఈ నెల 21లోగా క్లియరెన్స్ రాకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఏరియర్స్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించారు. అటు సాగర్ ఉప ఎన్నికలు, ఇప్పుడు వచ్చిన కార్పోరేషన్, మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ఫైల్ పెండింగ్ పడింది. కానీ ఎట్టకేలకు సీఎం దీనిని పరిశీలించి సంతకం చేయడంతో ఇది క్లియర్ అయింది. దీంతో ఉద్యోగ వర్గాలందరికీ పీఆర్సీ అమలు కానుంది. పెరిగిన సొమ్ముతో కొత్త వేతనాన్ని ఉద్యోగులు మే1న అందుకోనున్నారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు విద్యా వాలంటీర్లు, వీఆర్ఏ, వీఏవో, సర్వ శిక్షఅభియాన్ సిబ్బందికి కూడా పీఆర్సీ వర్తింపజేస్తున్నట్లు గతంలోనే సీఎం ప్రకటించారు. ఈ పీఆర్సీతో మొత్తంగా 9,17,797 మంది ఉద్యో గులు లబ్ధి పొందుతున్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం వివరాలను పీఆర్సీ నివేదిక ప్రకారం ఆర్థిక శాఖ మరోసారి వివరించింది. ఇప్పటి లెక్కల ప్రకారం ఔట్సోర్సింగ్ సిబ్బంది మూడు కేటగిరీల్లో ఉన్నారు. వారిలో గ్రూపు-4 కేటగిరీలో ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, మాలీ, కావుటి, కుక్, సైకిల్ ఆర్డర్లీ, చౌకీ దార్, ల్యాబ్ అటెండర్, దఫేదార్, జమేదార్, జిరాక్స్ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్, ష్రాఫ్/క్యాషియర్, లిప్ట్ ఆపరేటర్లకు నెలకు రూ.12 వేలు ఇస్తుండగా, వీరికి కనీస వేతనం రూ.19 వేలు చేయా లని పీఆర్సీ కమిషన్ సిఫారసు చేసింది. రూ.13 వేల నుంచి రూ. 15,030 వరకు కనీస మూలవేతనం పొందుతున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి కూడా బేసిక్ పే రూ.19 వేలు చేయాలని సిఫారసు చేసింది. గ్రూపు-3 కేటగిరీలోని డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనో, టైపిస్టు, టెలిఫోన్ ఆపరేటర్, స్టోర్ కీపర్, ఫొటోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, ల్యాబ్ అసిస్టెంట్, సినిమా/ఫిలిం/ఆడియోవిజువల్/డాటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్వైజర్, లైబ్రేరియన్, మేనేజర్ కేటగిరీల్లో నెలకు రూ.15 వేలు వేతనంగా ఉండగా కనీస వేతనం రూ.22,900 చేయాలని, ఇదే కేటగిరీలో రూ.19,500 వరకు వేతనం పొందుతున్న వారికి కనీస వేతనం రూ.22,900 చేయాలని పీఆర్సీ సిఫారసు చేసింది. గ్రూపు-3(ఏ) కేటగిరీలోని సీనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో, సీనియర్ అకౌంటెంట్, ట్రాన్స్‌లేటర్, కంప్యూటర్ ఆపరేటర్/ డీపీ వోలకు ప్రస్తుతం రూ.17,500 ఇస్తుండగా వారికి రూ.31,040 కనీ సం వేతనం ఇవ్వాలని సూచించారు. ఇక కాంట్రాక్టు ఉద్యోగుల్లో నూ ప్రస్తుతం నెలకు రూ.12 వేల నుంచి రూ.40,270 పొందుతు న్న ఉద్యోగులు ఉండగా కనీస వేతనాన్ని రూ.19 వేలుగా సూచిం చారు. జూనియర్ కాలేజీల్లో ప్రస్తుతం 3,687 మంది జూనియర్ లెక్చరర్లు ఉండగా రూ.37,100 వేతనం వస్తోంది. పీఆర్సీ వీరికి రూ.54,220 కనీస వేతనం ఇవ్వాలని సిఫా రసు చేసింది. 435 మం ది పాలిటెక్నిక్ లెక్చరర్లకు, 926 మంది డిగ్రీ లెక్చరర్లకు నెలకు రూ.40,270 వేతనంగా ఇస్తున్నారు. వీరికి రూ.58,850 కనీస వేతనంగా చేయాలని సిఫారసు చేసింది. సిఫారసులు అమలు చేసే ందుకు సీఎం నిర్ణయం తీసుకుని శనివారం ఆమోదం తెలిపారు.
తెలంగాణ ఉద్యోగులకు కొత్త పిఆర్సీతో ఈ నెల వేతనం..
By sree nivas
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement