షాద్‌నగర్ : కరోనా కారణంగా విద్యా వ్యవస్థ చిన్న బిన్నమై అనేక మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉపాధిని కోల్పోవడం జరిగిందని కరోనా వల్ల దాదాపుగా 13నెలల నుండి ప్రైవేట్ ఉపాధ్యాయులకు జీతాలు లేక, బిల్డింగ్స్ అద్దెలు, జీతాలు, ప్రాపర్టీ ట్యాక్స్, కరెంటు బిల్లులు, ఈఎంఐలు కట్టలేక యజమన్యాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. ఈ సందర్బంగా టిఆర్ ఎస్‌ఎంఎ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు షాద్ నగర్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైన తెలంగాణ ప్రభుత్వం మేలుకోని పక్క రాష్ట్రం మాదిరిగా 1నుండి 10 తరగతులు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తెరవాలని అన్నారు. ప్రైవైట్ ఉపాధ్యాయులకు నెలకు రూ. 6వేలు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ఎంఎ రాష్ట్ర, జి ల్లా మండల నాయకులు, సభ్యులు జోసెఫ్, రమణరెడ్డి, వంశీ కృష్ణ, నాగలింగం, రఫత్ సుల్తానా, జగదీష్, బీమ్ శంకర్, వాణి,ప్రవీణ్, మధుసూధన్‌రెడ్డి, నరేందర్, మోహన్, తదితరులు పాల్గోన్నారు.
.
ప్రైవేట్ ఉపాధ్యాయుల నిరసన..
Advertisement
తాజా వార్తలు
Advertisement