Sunday, November 24, 2024

ప్రైవేటు టీచర్లకి ఆర్ధిక సహాయం..

కవాడిగూడ : ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రతి టీచర్‌కు ఆర్ధిక సహాయం అందించాలని విరజానందా వైదిక్‌ విద్యాలయ కరస్పాండెంట్‌ ఆంజనేయులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కవాడిగూడలోని ఆర్య సమాజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా మహామ్మారి వలన పాఠశాలలు మూసివేయడంతో ఉపాద్యాయులు ఉపాధి కోల్పోయారన్నారు. ప్రభుత్వం ప్రతి టీచర్‌కు 2 వేల రూపాయలు, 25 కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తామని ప్రకటించడంతో అందరు సంతోషపడ్డారని తెలిపారు. ఆర్ధిక సహాయం కోసం 2 లక్షల 10 వేల మంది టీచర్లు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకున్నారు. 2020 సంవత్సరం ఫిబ్రవరి, మార్చి ఏదో ఒక నెల హజరు పట్టికను ఇతర వివరాలు అప్లై చేశారన్నారు. ఇందులో 1లక్షా 45 వేల మందికి సహాయం అందించి మిగిలిన 65 వేం మంది టీచర్లకు ఆర్ధిక సహాయం అందలేదని ఆయన వెల్లడించారు. విడతల వారిగా సహాయం అందిస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించి ఇప్పుడు అందించకపోవడం విచారకరమన్నారు. ఆపదలో ఉన్న ప్రైవేటు టీచర్లకు వెంటనే 2 వేల రూపాయల ఆర్దిక సహాయంతోపాటు 25 కిలోల బియ్యం వెంటనే అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement