కవాడిగూడ : నగరంలోని ముషీరాబాద్ ని యోజకవర్గం అడిక్‌మెట్ మున్సిపల్ డివిజన్ కార్పోరేటర్ సి సునిత భర్త సి ప్రకాష్‌గౌడ్ కరోనా సోకి మరణించారు. గత మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురికాగా పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో కరోనా సోకినట్లు నిర్దారణ కావడంతో జూబ్లిహిల్స్‌లోని విరంచి ఆసుపత్రిలో ఈ నెల 7న చేరాడు. ప్రకాష్‌గౌడ్ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మర ణించారు. దీంతో అడిక్‌మెట్ డివిజన్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఈ నెల 7వ తేదిన కార్పోరేటర్ కార్యాలయం ప్రారంభించగా ఈ కార్యక్రమానికి కేంద్ర హాంశాఖ సహాయ మంత్రి జి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె లక్ష్మణ్, పలువురు కార్పోరేటర్లు, బిజెపి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇందులో ఎంతమం దికి కరోనా సోకిందో అని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం ప్రకాష్‌గౌడ్ కాంగ్రేస్, టిఆర్‌ఎస్ బిజెపి పార్టీలలో పనిచేశారు. 1986 మున్సిపల్ ఎన్నికల తరువాత ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించలేదు దీంతో ప్రకాష్‌గౌడ్ హై కోర్టులో పిటీషన్ వేశారు. వెంటనే మున్సిపల్ ఎన్నికలు జరపాలని 2002లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పట్లో ప్రకాష్‌గౌడ్ సంచలనం సృష్టించారు. ప్రకాష్‌గౌడ్ వల్లే మున్సిపల్ ఎన్నికలు జరిగాయని అప్పట్లో చర్చ జరిగింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement