హైదరాబాద్, : రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. బుధవారం ఒక్కరోజే 13,688 మెగావాట్ల విద్యుత్ వినియోగాన్ని విద్యుత్ సంస్థలు అధిగమించాయి. గత ఏడాది ఫిబ్రవరి నెలలో 13,168 మెగావాట్స్ డిమాండ్ రాగా.. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఎండలు ఎక్కువ కావడంతో పాటు వ్యవసాయ రంగం కూడా పెరగడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరి గిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. 15 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని టీఎస్ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగా ణలో 5 వేల మెగావాట్ల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ట్లు ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్‌రెడ్డి సూచనలతో విద్యుత్ ఉద్యోగుల పనితనంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు సీఎండీ ప్రభాకర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ డిమాండ్‌పైన సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారని ఆయన వివరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1700 మెగావాట్ల డిమాండ్ ఉండేదని, ఇప్పుడు 2760 మెగావాట్స్ డిమాండ్ పెరిగిందని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. గ్రేటర్ పరిధిలో 3 వేల మెగావాట్స్ డిమాండ్ వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ఎడమ కాలువతో వ్యవసాయ రంగానికి విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. మూడు ఆమెజాన్ డేటా సెంటర్లకు 30 మెగావాట్స్ చొప్పున విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఐటీ పరిశ్రమలకు విద్యుత్ పంపిణి చేసేందుకు సిద్ధంగా ఉన్న ట్లు తెలిపారు. టీఎస్ ఐపాస్‌తో హైదరాబాద్ నగరంలో పరి శ్రమలు నెలకొల్పుతున్నారని, దీంతో విద్యుత్ వినియోగం పెరుగుతోందని రఘుమారెడ్డి పేర్కొన్నారు. ఎన్‌పీడీఎస్ పరిధిలో 40 శాతం వ్యవసాయ రంగం ఉంటుందని సీఎండీ గోపాల్‌రావు తెలిపారు. ఎన్‌పీడీసీఎల్ పరిధిలో 5042 మెగావాట్స్ డిమాండ్ ఉందన్నారు. వ్యవసాయం, మిషన్ భగీరథ తదితర వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు నిరంతరం ఐటీ నిఘా ఉంటుందని జేఎండీ శ్రీనివాసరావు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement