Tuesday, November 26, 2024

Postponed : కవిత బెయిల్ పిటిష‌న్ విచార‌ణ వాయిదా

అంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. నేడు విచార‌ణ ప్రారంభ‌మైన వెంట‌నే సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేనందున మరో రోజుకు విచారణ వాయిదా వేయాలని కవిత తరఫు లాయర్ కోరారు.

దీంతో కోర్టు తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. మరోవైపు తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను రేపు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలు నేడు కలవనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement