కవాడిగూడ : గాంధీనగర్ మున్సిపల్ డివిజన్‌లోని పలు అంగన్‌వాడి కేంద్రాలలో పోషణ సం భురాలు (పోషణ్ అభియాన్) వేడుకలు ఘనంగా నిర్వహించారు. జవహర్‌నగర్, అరుందతినగర్, సబర్మతినగర్ బస్తీల అంగన్‌వాడి కేంద్రాలలో జరిగిన అవ గాహాన సదస్సులకు డివిజన్ కార్పోరేటర్ ఏ పావని వినయ్‌కుమార్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణిలు, చిన్నారులకు తప్పనిసరిగా పౌష్టిక ఆహారం ఇవ్వాలని, అప్పుడే తల్లులు ఆరోగ్యంగా ఉంటారని, పిల్లల ఎదుగుదల ఉంటుందని వెల్లడించారు. అంగన్‌వాడి సెంటర్లలో అందిస్తున్న పౌష్టిక ఆహార పదార్ధలను ప్రతి ఒక్కరికి అందస్తున్నారని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. ప్రతి తల్లి తనబిడ్డకు తప్పనిసరిగా పౌష్టిక ఆహారం ఇవ్వాలని అప్పుడూ బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అనంతరం పోషణ ఉన్న ఆహారంపై అవగాహాన సదస్సు, ర్యాలీ నిర్వహించి పతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలొ బిజెపి నేత వినయ్‌కుమార్, అంగన్‌వాడి టి చ ర్లు సభిత, ప్రమీల, కౌసర్‌బేగం, నర్సమ్మ బిజెపి నాయకులు రాజు, శేషగిరి, శ్రీనివాస్‌గౌడ్, ఎల్లయ్య, రాజు, లక్ష్మణ్, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement