హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర అత్యంత కీలకం కాబోతోంది. విజయమే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు రచించడంలో పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ (పీకే), సునీల్ కనుగోలు (ఎస్కే)లు ఇక్కడే తిష్టవేసి కార్యకలాపాలు ప్రారంభించడం చర్చనీయాంశమవుతోంది. అందులో ఒకరు బీఆర్ఎస్కు దగ్గరైతే, మరొకరు కాంగ్రెస్‌తో జతకట్టి వ్యూహాలు రచించే పనిలో బిజీ అయ్యారు. కర్నాటక తరహా ఫలితాల సాధన కోసం కాంగ్రెస్ వ్యూమాత్మక కసరత్తు వేగవంతం చేసింది. అదే సమ యంలో ఒకవైపు అభివృద్ధి మంత్రం, మరోవైపు పొలిటికల్ స్ట్రాటజీతో బీఆర్ఎస్ రెడీ అవుతోంది. కర్నాటక ఎన్నికలు ముగిసిన వెంటనే సునీల్ కనుగోలు తెలంగాణలో రాజకీయాల్లో తెరపైకి వచ్చారు. దేశంలో ఎన్నికల వ్యూహకర్త అంటే ముందుగా గుర్తొచ్చేది ప్రశాంత్ కిశోర్. గత పదేళ్లుగా ఆయన చాలా పార్టీ లకు స్ట్రాట్రజిస్టుగా పనిచేశారు. అనేక రాష్ట్రాల్లో పీఠాలను కదిలించారు. చాలామందిని అధికార పీఠమెక్కించారు.
అయితే, ఇటీవల ఆయన స్ట్రాట్రజిస్టు నుంచి పొలిటీ-షియన్‌గా అవతారమెత్తారు. రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటు-న్నారు. కానీ వ్యూహ కర్త వాసనల నుంచి మాత్రం పోలేదు. ఆయన టీ-మ్ వివిధ రాష్ట్రాల్లో సేవలందిస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు పీకే టిమ్లే కీలకంగా సేవలందిస్తున్నాయి. వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందిస్తున్నాయి. కానీ గతంలో మాదిరిగా పీకే వ్యూహాలేవీ వర్కవుట్ కావడం లేదన్న వాదన కూడా ఉంది. ఇటీవల కాలంలో ఆయనిస్తున్న స్లోగన్స్ మరీ పేలవంగా ఉంటు-న్నాయి. ప్రజల్లో రోత పుట్టిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో విమర్శలున్నాయి. అందుకే అప్ డే-టె-డ్ స్ట్రాట్రజిస్టులు తెరపైకి వస్తున్నారు.
కర్నాటకలో బ్లాక్ బస్టర్ స్ట్రాటజీ..
కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో ఓ కొత్త స్ట్రాట్రజిస్టు తెరపైకి వచ్చారు. ఆయనే సునీల్ కొనుగోలు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు ఆయన సేవలందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ- సభ్యుడు కూడా. అందుకే అంకిత భావంతో సేవలు అందించడం ప్రారంభిం చారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందిం చారు. ఆయన స్లోగన్స్ గన్స్‌లా పేలాయి. ఆయన వ్యూహాలు ప్రత్యర్ధులకు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాయి. చివరికి అదిరిపోయే విజయం కాంగ్రెస్ ఖాతాలో పడింది. సునీల్ కనుగోలు ఒక సామన్యుడిగా ఉంటారు. ఆయనలో ప్రొఫైల్ మెయిం-టె-యిన్ చేస్తారు. ఎక్కడా ఆయన్ ఫోటో కనిపించదు. ఎక్కడా ఆయన మాట వినిపించదు. కర్నాటకలో ఇదే వర్కవుట్ అయ్యింది.
సునీల్ ఇక తెలంగాణపైనే పూర్తిస్థాయి దృష్టి
సునీల్ కొనుగోలు నెక్ట్స్ తెలంగాణపై కాన్సంట్రేట్ చేసినట్లె తెలు స్తోంది. హైదరాబాద్‌లో కార్యాలయం తెరిచి రాజకీయ వ్యూహ రచన సేవలు ప్రారంభించారు. సైలెం ట్‌గా పనిచేసుకుంటూ పోతున్నారు. కర్నాటకలో ఒకే ఒక స్లోగన్‌తో ఆకట్టు -కున్నారు. 40 శాతం గవర్న మెంట్ అంటూ బీజేపీ పై బాణం వదిలారు. బీజేపీకి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశారు. ఆ ఆరోపణ నుంచి బయటపడలేక బీజేపీ భారీ మూల్యం చెల్లించు కుంది. అయితే, సునీల్ ఇప్పుడు తెలంగాణలో ఆపరేషన్స్ ప్రారంభించడంతో బీఆర్ఎస్ ఒకింత కలవరపాటుకు గురవుతోంది. మొన్న ఆ మధ్యన హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంపై తెలంగాణ పోలీసులు దాడిచేశారు. కంప్యూటర్లను ఎత్తుకుపోయారు. కర్నాటక ఎన్నికల సమాచారం బీఆర్ఎస్ ద్వారా బీజేపీకి చేరిందని వార్తలు వచ్చాయి. కానీ కొత్త ఎత్తుగడలతో సునీల్ కర్నాటకలో ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి మంచి విజయాన్ని అందించారు.
అన్ని పార్టీల్లో జోరందుకున్న రాజకీయ వ్యూహాలు
అయితే, ఇప్పుడు తెలంగాణలో సునీల్ అడుగుపెట్టబోతున్నా రన్న వార్తలు జోరందుకున్నాయి. దీంతో ఎవరికి వారు పార్టీల అధినేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. దీంతో ఎటు-వంటి స్లోగన్స్ వస్తాయోని బీఆర్ఎస్ ఎదురుచూస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్కు ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా ఉన్నారు. దీంతో సునీల్ కనుగోలు వర్సెస్ పీకే అన్నట్టు- యుద్ధం జరగనుంది. అయితే సునీల్ అటు- బీజేపీకి, ఇటు- బీఆర్ఎస్ మైండ్ బ్లాక్ అయ్యే స్లోగన్స్ తెరమీదకు తేనున్నట్టు- తెలుస్తోంది. దానికి విరుగుడు చర్యలుగా పీకే ఎలా వ్యవహరిస్తారో తెలియాల్సి ఉంది. ఆరు నెలల పాటు- తెలంగాణ పాలిటిక్స్‌ను ఈ ఇద్దరు స్ట్రాటజిస్టులు షేక్ చేసే చాన్స్ కనిపిస్తోంది.