Saturday, November 23, 2024

TG | దీపావళి పండుగకు పోలీసుల ఆంక్షలు..

దీపావళి పండుగ‌ వేళ‌ హైదరాబాద్ వాసులకు పోలీసులు షాక్ ఇచ్చారు. పటాకులు కాల్చాలని భావించే వారిపై ఆంక్షలు విధిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. దీపావళి సంద‌ర్భంగా బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చకూడదని…. ఎక్కువ శబ్దాలు వ‌చ్చే క్రాకర్స్ రోడ్లపై కాల్చకూడదని పోలీసులు హెచ్చరించారు.

అంతేకాకుండా నగరంలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే క్రాకర్స్ కాల్చాలని పరిమితి విధించారు. ఈ రెండు గంటల సమయంలోనూ.. భారీ శబ్దంతో పేలే టపాసులను (55 డెసిబెల్స్ మించి శబ్ధం చేసే క్రాకర్స్) కాల్చటంపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. నగరవాసులంతా ఈ నిబంధనలకు పాటించి.. తమకు సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement