జన్వాడ ఫామ్ హౌస్ కేసులో విజయ్ మద్దూరి డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు… విచారణకు హాజరు కావాలని విజయ్ మద్దూరికి నోటీసులు పంపారు. అయితే పోలీసుల నోటీసులపై విజయ్ స్పందించలేదు. దీంతో నేడు జూబ్లీహిల్స్ లోని విజయ్ మద్దూరి నివాసంలో మోకిళ్ల పోలీసులు గంటకు పైగా సోదాలు నిర్వహించారు.
జన్వాడలో సోదాలు జరుపిన సమయంలో విజయ్ మద్దూరి తన ఫోన్ కాకుండా వేరొకరి ఫోన్ పోలీసులకు ఇచ్చాడు. ఇప్పుడు అతడి ఫోన్ ను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు వచ్చారు. మోకిళ్ల పోలీసులు గంటకు పైగా వెతుకుతున్నారు.