హైదరాబాద్, జూన్ 5 (ప్రభ న్యూస్) : జూన్ 5 పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మేరీ లైఫ్ మేర స్వేచ్ఛ షేహర్ పేరిట పర్యావరణాన్ని కాపాడటానికి ప్రతిఒక్కరూ కృషి చేసేవిధంగా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయా విభాగాల హెచ్ ఓ డి లు, అధికారులు, సిబ్బంది అందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు. పర్యావరణాన్ని రక్షించడానికి సామాజికంగా, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. నగరం ఎన్విరాన్ మెంటల్ ఫ్రెండ్లీగా 2028 సంవత్సరానికి రూపాంతరం చెందేదుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. స్వచ్ఛత దైనందిన జీవనశైలిలో అలవర్చుకున్న అలవాటు వ్యర్థాలు పనికిరాని వస్తువులు పునర్వినియోగం, రీసైకిల్ చేసుకునే అవకాశం కలదు. (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, ఆర్ఆర్ఆర్) మేరీ లైఫ్, మేరా స్వచ్ఛ్ షెహార్ నినాదంతో ముందుకు పోవాలని, ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలన్నారు.
ఈ నేపథ్యంలో ప్రజలు తమ ఉపయోగించని వస్తువులు, పాత పుస్తకాలు, బట్టలు, బొమ్మలు మొదలైన వాటిని స్వచ్ఛందంగా నగరంలో ఏర్పాటు చేసిన త్రిబుల్ ఆర్ కేంద్రాల్లో ఇవ్వవచ్చు. ఈ వస్తువులు తిరగి పునర్నిర్మించి పునర్వినియోగం ఉపయోగించడం జరుగుతుంది. ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ వి కృష్ణ, జయరాజ్ కెన్నెడీ, సీసీపీ దేవేందర్ రెడ్డి, అడిషనల్ సీసీపీ శ్రీనివాస్ రావు, సీఏం అండ్ హెచ్ ఓ డాక్టర్ పద్మజ, సీ పీ అర్ ఓ మొహమ్మద్ ముర్థుజా, అకౌంట్ చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర రెడ్డి, జాయింట్ కమిషనర్ లు ఉమ ప్రకాష్, వెంకట్ రెడ్డి శశికళ, యస్ బి ఏమ్ భారత్, ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. అనంతరం అందరూ కలిసి పర్యావరణ పరిరక్షణకు స్లోగన్ల తో ర్యాలీని నిర్వహించారు.