Friday, November 22, 2024

Saidabad Rape case : నిందితుడు రాజు మృతిపై హైకోర్టులో పిల్

తెలంగాణలో సంచలనం సృష్టించిన సైదాబాద్ ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రాజుది ఆత్మహత్య కాదని.. కస్టోడియల్ మృతిగా అనుమానం ఉందని పౌర హక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్ పిల్ దాఖలు చేశారు. దీని​పై విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.

కాగా, వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలోని నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ట్రాక్‌ వద్ద రాజు మృతదేహం లభ్యమైంది. మృతుడి చేతిపై మౌనిక అనే పచ్చబొట్టు ఆధారంగా అతను రాజుగా గుర్తించారు. సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత గత గురువారం(సెప్టెంబర్ 9) నుంచి పరారీలో ఉన్నాడు. రాష్ట్రవ్యాప్తంగా అతని కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్డడం సహా సోషల్ మీడియాలో ఫొటోలు.. విస్తృతంగా ప్రచారం జరగడంతో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు రాజుది ఆత్మహత్య కాదు హత్యే అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులే తన భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని నిందితుడు రాజు భాగ్య మౌనిక ఆరోపించింది. తన భర్తను పోలీసులు తీసుకెళ్లి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. తన భర్త మంచోడని, ఇలాంటి ఘోరాలు చేసే వ్యక్తి కాదని పేర్కొంది. ఒకవేళ నిజంగా తన భర్త తప్పు చేస్తే చట్టపరంగా నిరూపించి శిక్షించాలని, ఇలా చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఇన్ని రోజులు పోలీసుల అదుపులోనే ఉన్నాడని, అతడిని చిత్రహింసలకు గురిచేసి చంపేశారని మౌనిక ఆరోపించింది.

ఇది కూడా చదవండి: తెలంగాణ విమోచన దినోత్సవం: సెప్టెంబర్ 17 చరిత్ర ఇది..

Advertisement

తాజా వార్తలు

Advertisement