Tuesday, November 19, 2024

యూపీఐ పేమెంట్లకు వీలు కల్పించిన ఫిన్ టెక్ వేదికగా PhonePe ఘనత

UPI ఇంటర్నేషనల్‌ పేమెంట్లకు సహకారాన్నిప్రారంభించామని భారతదేశంలోని అతిపెద్ద డిజిటల్ పేమెంట్ల కంపెనీ అయిన PhonePe ప్రకటించింది. ఈ ఫీచర్ విదేశాలకు వెళుతున్న PhonePe భారతీయ వినియోగదారులకు UPIని ఉపయోగించి విదేశీ మర్చంట్లకు తక్షణమే పే చేసేందుకు వీలు కల్పిస్తుంది. యునైటడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, నేపాల్, భూటాన్‌లలో స్థానిక QR కోడ్ కలిగిన అంతర్జాతీయ మర్చంట్ అవుట్‌లెట్లు అన్నిటికీ తక్షణ పేమెంట్లు చేసేందుకు సహకరిస్తుంది.

ఈసంద‌ర్భంగా PhonePe CTO, సహ వ్యవస్థాపకుడు రాహుల్ చారి మాట్లాడుతూ… గ‌డచిన ఆరేళ్లకు పైగా, భారతదేశ వ్యాప్తంగా మన జీవితాలను రూపాంతరం చేసిన UPI పేమెంట్ల విప్లవాన్ని అనుభవించడంలో తాము చాలా అదృష్టవంతులమన్నారు. ప్రపంచంలోని ఇతర భూభాగాలకు కూడా UPI అనుభవాన్ని అందించడంలో UPI ఇంటర్నేషనల్ మొదటి ప్రధాన అడుగుగా నిలుస్తుందన్నారు. ఇది ఒక గేమ్‌ఛేంజర్‌గా నిరూపించబడుతుందని, విదేశాలకు వెళ్లే భారతీయులు మర్చంట్ అవుట్ లెట్లలో పే చేసే పద్ధతిని పూర్తిగా మారుస్తుందని తాను గట్టిగా చెప్పగలనన్నారు. మార్కెట్ కు కొత్త UPI ఫీచర్లను తీసుకునే మొదటి TAPP (థర్డ్ పార్టీ యాప్)గా నిలవడం పట్ల ఎప్పటిలాగే PhonePe గర్విస్తోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement