Thursday, January 30, 2025

Phone Tapping – భుజంగరావు, రాధాకిష‌న్ రావుల‌కు బెయిల్ మంజూరు

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావుల‌కు బెయిల్ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు నేడు ఆ ఇద్ద‌రికి బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్షల చొప్పున 2 ష్యూరిటీలు, పాస్పోర్టులు సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని హైకోర్టు వారికి స్పష్టం చేసింది. కాగా, ఇదే కేసులో నిందితుడిగా ఉన్న తిర‌ప‌తన్న‌కు సుప్రీం కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసిన విష‌యం తెలిసిందే..

Advertisement

తాజా వార్తలు

Advertisement