హైదరాబాద్: పీరియడ్ ఎడ్యుకేషన్, ప్రొడక్ట్స్ లేకపోవడం వల్ల భారతదేశంలో ప్రతి ఐదుగురు బాలికలలో ఒకరు చదువు మానేస్తున్నారు. బహిష్టు విద్య, పరిశుభ్రత నిర్వహణ సమస్యను పరిష్కరించడానికి, పి అండ్ జి విస్పర్, యునెస్కో ఇండియాలు అమృత విశ్వ విద్యాపీఠంతో కలిసి, ముఖ్యంగా పాఠశాలకు హాజరయ్యే యువతులతో సహా మహిళల్లో అవగాహన పెంచడానికి ఒక కార్యక్రమం ప్రారంభించాయి. ఈ ప్రారంభోత్సవానికి హాజరైన అతిథులలో ముఖ్య అతిథి డాక్టర్ సౌమ్య మిశ్రా, ఐపీఎస్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డీజీపీ కార్యాలయం, హైదరాబాద్, అతిథి డి హరి చందన, ఐఏఎస్, ప్రధాన కార్యదర్శి కార్యాలయం, సెక్రటేరియట్, హైదరాబాద్, డాక్టర్ హుమా మసూద్, యునెస్కో ఇండియాలో సీనియర్ జెండర్ స్పెషలిస్ట్, శిల్పి గుప్తా, ప్రొడక్ట్ సప్లై లీడర్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా, డాక్టర్ ప్రజ్ఞాత కొమరవోలు, కొచ్చిలోని అమృత హాస్పిటల్‌లో పీడియాట్రిక్ కన్సల్టెంట్ వున్నారు.
డాక్టర్ హుమా మసూద్ మాట్లాడుతూ.. యునెస్కో పి అండ్ జి విస్పర్ కార్యక్రమం స్పాట్‌లైట్ రెడ్, పాఠశాలల్లో రుతుక్రమ ఆరోగ్యం, పరిశుభ్రత నిర్వహణ, తక్షణ అవసరాన్ని పరిష్కరించడానికి ఒక సమగ్ర విధానం కీప్ గర్ల్స్ ఇన్ స్కూల్ అని అన్నారు. డి హరి చందన, ఐఏఎస్ మాట్లాడుతూ… మనం ఆడపిల్లలకే కాదు, అబ్బాయిలకు, తండ్రులకు, ప్రతి వ్యక్తికి కూడా ఈ విద్యను అందించాలని, సాంస్కృతిక నిషేధాలను ఛేదించి, అవగాహనను పెంపొందించాలన్నారు. సమాజాన్ని మార్చే శక్తి మనకు ఉందని, ఈ సందేశాన్ని వ్యాప్తి చేద్దాం, ఇతరులను ప్రేరేపించి, ఉజ్వల భవిష్యత్తును సృష్టిద్దామన్నారు. ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియాలో ప్రొడక్ట్ సప్లై లీడర్ శిల్పి గుప్తా మాట్లాడుతూ… యునెస్కోతో కలిసి సమగ్రమైన టీచింగ్ మాడ్యూల్స్‌ను ఆవిష్కరించడం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. పీరియడ్ సమాచారం మాత్రమే కాకుండా పోషకాహారం, విభిన్న లింగాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మార్గదర్శకత్వం కూడా కలిగి ఉంటాయన్నారు.