ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సూచించారు. ఈరోజు గోల్నాక డివిజన్ లోని ఖాజాగరిబ్ నగర్, కృష్ణా నగర్, లంక, శాస్త్రీ నగర్, కమలా నగర్ ప్రాంతాల్లో పర్యటించి, రోడ్లపై నీరు నిలిచిన విధులను, కాల్వలు, డ్రైనేజీలు, అక్కడక్కడా కూలిన చెట్లను పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలతో మాట్లాడుతూ… భారీవర్షాల నేపథ్యంలో కరెంట్ స్తంభాలకు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలబడినా, డ్రైనేజీలు పొంగినా అలాగే రోడ్లపై చెట్లు పడిపోయినా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. అలాగే పాత ఇళ్ళల్లో నివసించే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు అత్యవసరం ఐతే తప్ప బయటకు వెళ్లకూడదని, తగిన జాగత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.