తక్కువ ధరకే రుచికరమైన వంటకాలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు కుమారీ ఆంటీ. హైదరాబాద్ మాదాపూర్‌లోని కోహినూరు హోటల్ ఎదురుగా చిన్న షాప్ పెట్టుకుని బిజినెస్ నడిపిస్తుంది. అయితే, ఆమె దగ్గర ఎక్కువ మంది భోజనం చేయడానికి వస్తుండటం గమనించిన కొందరు ఫుడ్ వ్లాగర్స్ వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెట్టటంతో.. ఆమె ఓ సెన్సెషన్‌గా మారిపోయింది. స్టార్టింగ్‌లో కేవలం 5 కేజీల రైస్‌తో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్.. ఇప్పుడు రోజుకు 100 కేజీలకు పైగానే అమ్ముడుపోతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ఫేమస్ అవ్వడమే ఆవిడకి పెద్ద సమస్యగా మారింది.
స్ట్రీట్ ఫుడ్ కారణంగా కుమారి ఆంటీ.. సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతూ సెన్సేషన్‌గా మారిపోయింది. దీంతో.. యువత అంతా ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు ఎగబడిపోతున్నారు. ఫలితంగా రద్దీ ఎక్కువైపోయి, రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జాం అవుతోంది. ఇది కాస్త ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారింది. దీంతో ట్రాఫిక్ జామ్‌కు కారణమైన కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేసి షాప్ క్లోజ్ చేయించారు.