అంతర్జాతీయ బ్యాంకింగ్, ఆర్థిక సేవల పరిశ్రమకు భవిష్యత్తులోనూ ఉపయోగపడేందుకు సిద్ధంగా ఉన్న సేవలందించే ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ అయిన పెన్నాంట్ టెక్నాలజీస్ తన కొత్త కార్పొరేట్ కార్యాలయాన్ని హైదరాబాద్ నగరంలో గల సైబర్ గేట్‌వే వద్ద ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు డాక్టర్ రాజీవ్ శర్మ ఐఏఎస్ (రిటైర్డ్) ఈ కొత్త కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పెన్నాంట్ టెక్నాలజీస్ డైరెక్టర్, సీఈవో రామకృష్ణ రాజు మాట్లాడుతూ… హైదరాబాద్ నగరంలోని తమ కొత్త కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించినందుకు తాము ఎంతో సంతోషిస్తున్నామన్నారు. ప్రత్యేకించి మార్కెట్లో తమ ఉత్పత్తికి అద్భుతమైన ఆదరణ చూస్తున్న సమయంలో ఈ కార్యాలయం ప్రారంభమైందన్నారు.
పెన్నాంట్ ఇప్పుడు వృద్ధి దశలో ఉందన్నారు. అంతర్జాతీయ కస్టమర్లకు నిరంతరం మారే అవసరాలను సమర్థంగా తీర్చేందుకు తమ ప్రణాళికలకు ఈ పెద్ద కేంద్రం సరిగ్గా సరిపోతుందన్నారు. కృత్రిమ మేధ, క్లౌడ్, ఆటోమేషన్ మొదలైన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలతో కూడిన రాబోయే తరం ఉత్పత్తులను తమ కస్టమర్లకు అందించడానికి ఈ కేంద్రంతో సమకూరిన బలం తమకు వీలు కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రాజీవ్ శర్మ, హైసియా ఉపాధ్యక్షుడు కిరణ్ చెరుకూరి, వాణిజ్యవేత్త సునీల్ చలమలశెట్టి, పెన్నాంట్ టెక్నాలజీస్ సీఈవో అండ్ డైరెక్టర్ రామకృష్ణరాజు, పెన్నాంట్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ ప్రదీప్ వర్మ, పెన్నాంట్ టెక్నాలజీస్ కన్సల్టింగ్ డైరెక్టర్ దాట్ల రవివర్మ, పెన్నాంట్ టెక్నాలజీస్ ప్రొడక్ట్ ఇంజినీరింగ్ విభాగాధిపతి పి.ఎ.శ్రీనివాసవర్మ, పెన్నాంట్ టెక్నాలజీస్ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ విభాగాధిపతి డి.రామకృష్ణ వర్మ, పెన్నాంట్ టెక్నాలజీస్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ విభాగాధిపతి ఎస్.రవి, తదితరులు పాల్గొన్నారు.