పట్టణాలు, చిన్న నగరాలు, నగరాల్లో విస్తరించి ఉన్న 16 బ్రిక్ అండ్ మోర్టార్ సెంటర్ల నెట్వర్క్కు విజయవాడ ఎక్స్పీరియన్స్ సెంటర్ సరికొత్తగా వచ్చి చేరింది. పాలసీబజార్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ క్రింద ఉన్న బ్రాండ్, పీబీ పార్ట్నర్స్ కాగా, దాని పీఓఎస్పీ మోడల్ ద్వారా ముఖ్యంగా పట్టణాలు, చిన్న నగరాల్లో బీమా సౌలభ్యాన్ని విస్తరించేందుకు కట్టుబడి ఉంది. విస్తృతమైన ఏజెంట్ భాగస్వామి శిక్షణ, అత్యాధునిక సాంకేతికతపై దృష్టి సారించి, పీబీ పార్ట్నర్స్ మంచి భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తోంది. ఈ లక్ష్యానికి అనుగుణంగా, పీబిపార్ట్నర్స్ ఇటీవల విజయవాడలో కొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది. ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఏజెంట్ భాగస్వామి ఎంగేజ్మెంట్ అండ్ అప్-స్కిల్మెంట్ పట్ల పీబీ పార్ట్నర్స్ కొనసాగిస్తున్న నిబద్ధతను కలిగి ఉంటాయి.
ఈసందర్భంగా పీబీపార్ట్నర్స్ సహ వ్యవస్థాపకుడు ధ్రువ్ సారిన్ మాట్లాడుతూ…. తాము ప్రారంభం నుంచి భారతదేశంలోని ప్రతి మూలకు బీమాను విస్తరించడమే తమ లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. తమ ఏజెంట్ భాగస్వాములకు భరోసా ఇచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. వారు సంతృప్తి చెందడమే కాకుండా, వారి ప్రయాణంలో అవసరమైన వనరులు, మార్గదర్శకత్వంతో పూర్తిగా సిద్ధంగా ఉన్నారన్నారు.
ఎందుకంటే తాము తమ ఏజెంట్ భాగస్వాములను మరింతగా ప్రోత్సహించి, వారి సేవలను విస్తరించడమే తమ అగ్ర ప్రాధాన్యతగా ఉండడంతో, విజయవాడలో ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభోత్సవం ఒక ముఖ్యమైన దశను సూచిస్తుందన్నారు. ఆ లక్ష్యాలను సాధించడంలో ఈ అనుభవ కేంద్రాలు చాలా ముఖ్యమైనవన్నారు. ఈ మైలురాయి పీబీ పార్ట్నర్స్ను మరింత గొప్ప విజయం వైపు నడిపిస్తుందని తాము విశ్వసిస్తున్నామని తెలిపారు.