Tuesday, November 26, 2024

పట్టాలెక్కనున్న పాతబస్తీ మెట్రో

ఎన్నోఏళ్లుగా పాతబ స్తీ వాసులు ఎదురుచూస్తున్న ఎంజీబీఎస్‌ టూ ఫలక్‌ను మా మెట్రోరైల్‌ నిర్మాణానికి త్వరలో మోక్షం లభించనుంది. మెట్రో మూడు కారిడార్లలో ఒకటైన బ్లూ కారిడార్‌ను జేబీఎస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి ఎంజీబీఎస్‌ మీదుగా ఫలక్‌నుమా వరకు మొత్తం 14 కిటోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించారు. లైన్‌ అలైన్‌మెంట్‌ విషయంలో స్థానికంగా కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాడంతో ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు ప్రతిపాదించిన 5.5 కిలో మీటర్ల మార్గం ఆగిపోయింది. దీంతో జేబీఎస్‌ పరేడ్‌గ్రౌండ్‌ నుంచి ఎంజీ బీఎస్‌ వరకు పూర్తయిన 9.6 కిటోమీటర్ల మార్గాన్ని 2020లో ప్రారభించారు. గత రెండేళ్లుగా ఈ మార్గంలో నిర్మాణ పనులు ఓ కొలిక్కి రాలేదు. భూసేకరణకు సంబంధించి స్థానికులు సహకరించక పోవడం, ఈ దారిలో 90కి పైగా మతపరమైన కట్టడాలు ఉన్నందున ఈ నిర్మాణం సాధ్యం కాలేదని అప్పట్లో అధికార వర్గాలు ప్రకటించాయి. అయితే స్థానికంగా ఉండే ఓ ప్రధాన పార్టీ మెట్రో నిర్మాణానికి అనుకూలంగా ఉండటం, గడిచిన అసెంబ్లి సమావేశాల్లో పాతబస్తీ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించడంతో నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయని అధికారులు భావిస్తున్నారు. జీహెచ్‌ ఎంసీతో కలిసి త్వరలో భూసేకరణ పూర్తి చేసి పనులు చేపట్టాలని మెట్రో వర్గాలు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

అలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పులు?

ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు ప్రతిపాదించిన 5.5 కిలో మీటర్ల మార్గంలో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మార్గంలో సాలార్‌ జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, శాలిబండ, శంషేర్‌ గంజ్‌ స్టేషన్లను ప్రతిపాదించారు. ఈ స్టేషన్‌ల గుండా ప్రతిపాదించిన మార్గంలో కొన్నిచోట్ల భూసే కరణకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా రెండు, మూడు చోట్ల చాలా సున్నితమైన అంశాలతో ముడిపడి ఉందని, అక్కడ మాత్రమే లైన్‌ అలైన్‌ మెంట్‌ మార్పు తప్పదని భావిస్తున్నారు. స్థానికంగా అనుకూల పరిస్థితులు ఉండటంతో స్వల్ప మార్పులతో త్వరలో ఈ మార్గం పట్టాలెక్కనుందని తెలుస్తోంది.

- Advertisement -

ఆరు దిక్కుల్లో మెట్రో రైల్‌ ..

మైట్రో మొదటి దశలో ప్రతిపాదించిన ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా ఫలక్‌నుమా వరకు ఆగిపోయిన 5.5 కిలో మీటర్ల నిర్మాణం పూర్తయితే మెట్రో కొత్త సొగబులను సంతరించు కుంటుంది. నగరంలోని ఆరు దిక్కుల నుంచి మెట్రో కారిడార్లతో త్రికోణాకారంలో నగరానికే అందం తీసుకురానుందని మెట్రో వర్గాలు అంటున్నాయి. ఈ నిర్మాణం వల్ల దేశంలోనే అతిపెద్ద ఎలివేటెడ్‌ మెట్రో రైల్‌గా హైదరాబాద్‌ మెట్రో చరిత్రలో నిలిచిపోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement