Friday, December 27, 2024

Party Funds – క‌మ‌లానికి ఒక్క ఏడాదిలోనే రెండు వేల కోట్లకు పైగా విరాళాలు ..

న్యూ ఢిల్లీ – పార్టీ ఫండ్ సేక‌ర‌ణ‌లో బిజెపి తొలి స్థానంలో నిలిచింది.. ఈ పార్టీ ద‌రిదాపుల‌లో కూడా ఇటు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం ..ఈ పార్టీ విరాళాల రూపంలో 2023-24లో ఏకంగా రూ. 2వేల 244 కోట్లు పొందింది. ఇక ప్రతిపక్ష పార్టీ, దేశంలో రెండో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ కు కేవలం రూ. 288.9 కోట్లు మాత్రమే వచ్చాయి. ప్రుడెంట్ ఎలక్టోకరల్ అధికంగా విరాళాలు ఇచ్చిన దాతగా ఉంది. నిబంధనల ప్రకారం ఎలక్టోరల్ బాండ్ రషీదులు మినహాయించబడ్డాయి.

2023-24లో వ్యక్తులు, ట్రస్టులు , కార్పొరేట్ సంస్థలు నుంచి రూ. 20వేలు అం తకంటే ఎక్కువ విరాళాల రూపంలో బీజేపీకి దాదాపు రూ. 2వేల 244కోట్లు వచ్చాయి. ఇది 2022-23తోలో వచ్చిన విరాళాల కంటే మూడు రెట్లు ఎక్కువ. మరోవైపు కాంగ్రెస్ కు 2023-24లో రూ. 288.9 కోట్ల విరాళాలు వచ్చాయి. గతేడాది కాంగ్రెస్ కు కేవలం 79.9కోట్లు మాత్రమే వచ్చాయి. 2023-24 లో రెండు పార్టీలకు వచ్చిన విరాళాల‌ వివరాల రిపోర్టులను ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ లో ఉంచింది. ఫ్రూడెంట్ ఎలక్టోర్ ట్రస్ట్ నుంచి బీజేపీ రూ. 723.60కోట్ల విరాళాలు అందుకుంది. అదే కంపెనీ కాంగ్రెస్ కు రూ.156.4కోట్లు అందించింది. రెండు పార్టీలకు అత్యధిక విరాళాలు ఈ సంస్థ నుంచే వచ్చాయి. బీజేపీకి మూడింట ఒకవంతు, కాంగ్రెస్ కు సగానికి పైగా ఈ సంస్థనుంచే విరాళాలు అందాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు తమ 2023-24 కంట్రిబ్యూషన్ రిపోర్టులలో పార్టీ విరాళాలను ప్రకటించాయి. వీటిలో బిఆర్ఎస్ 495.5 కోట్లు, డీఎంకే 60 కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ రూ.121.5 కోట్లు, జెఎంఎం రూ. 11.5 కోట్లుపొందినట్లు ప్రకటించాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement