Thursday, November 21, 2024

తెలంగాణాలో పాక్షిక లాక్ డౌన్ త‌ప్ప‌దా……?

పబ్‌లు, క్లబ్‌లు, మాల్స్‌, హాల్స్‌పై ఆంక్షలు విధించాలి
ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యశాఖ నివేదిక
వారంలో మూడు రోజులు లాకడౌేన్ లేదా ప్రతి రోజూ నైట్‌ కర్ఫ్యూ
నివేదికలో అధికారుల సిఫారసు – సొంతూళ్లకు తరలుతున్న వలస కూలీలు

గతేడాది అన్‌లాక్‌ ప్రక్రియను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం దశలవారీగా దాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఆ తర్వాత వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో కరోనా కేసులు పెరుగుతున్నా క్రమంగా జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. అయితే కొద్ది రోజులుగా మళ్లిd దేశంలో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆయా రాష్ట్రాలు కట్టడి చర్యలు ప్రారంభించాయి.

హైదరాబాద్‌, : తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పల—-ు పాఠశాలలు, హాస్టళ్లలో కరోనా కలకలం కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ప్రతి రోజూ విద్యార్థులు, సాధారణ ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్‌ లేదా పాక్షిక లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష బోధనను నిలిపివేసింది. 5 నుంచి 9 తరగతుల విద్యార్థులకు కూడా ప్రత్యక్ష బోధనను నిలిపి వేయాలని భావిస్తోంది. కరోనా కేసులు ఇదే మాదిరిగా పెరుగుతూ పోతే పాఠశాలలు, విద్యా సంస్థలు మూసివేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కరోనా ప్రభావంతో దేశంలో లాక్‌డౌన్‌ విధించి ఏడాది గడుస్తోంది. గతేడాది 2020లో సరిగ్గా మార్చి 22 నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ అదేరీతిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే రాష్ట్రంలో పాక్షిక లాక్‌ డౌన్‌ విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
త్వరలో సీఎం కేసీఆర్‌ సమీక్ష
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగు తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన కట్టడి చర్యలపై త్వరలో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించ నున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం తరుపున ఎలాంటి చర్యలు తీసు కోవాలన్న దానిపై వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధి కారులతో ఆయన చర్చించనున్నట్లు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో కోవిడ్‌పై సీఎం కేసీఆర్‌ కీలక సమీక్ష నిర్వహించే అవకాశముంది.
మాస్కు, భౌతికదూరం మరిచినందునే…
కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యం లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలిసింది. కరోనా కాస్తా తగ్గుముఖం పట్టిన తర్వాత జనంలో కరోనా జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యం పెరిగిపోయిందని, మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం మరిచిపోయి నం దునే ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొ న్నట్లు సమాచారం. పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలో ప్రవేశించే వారిపై నిఘా పెంచాలని, ఇందుకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచే యాల్సి ఉందని ప్రభుత్వానికి సూచించింది. ఆ దిశగా ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని కోరినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. వారంలో 3 రోజులపాటు లాక్‌డౌన్‌ లేదా రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తే బాగుంటుందని వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి బార్లు, క్లబ్‌లు, పబ్‌లు, సినిమాహాళ్లు తదితర జనం గుంపులుగా ఒకచోట చేరే అవకాశమున్న కార్యక్ర మాలకు అనుమతిని నిరాకరించాలని నివేదిక సమర్పిం చినట్లు సమాచారం. జనం మాస్కు ధరించకపోవడం, భౌతికదూరం పాటించక పోవడం వల్లనే కరోనా మరో మారు విజృంభిస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ సీఎం కేసీఆర్‌కు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పెళ్లిళ్లు, శుభకార్యాలపైనా ఆంక్షలు విధిం చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
సొంతూళ్లకు కార్మికుల పయనం
గతేడాది లాక్‌డౌన్‌తో పడిన ఇబ్బందులు, అను భవించిన బాధలు, వలస కార్మికుల కళ్లలో ఇంకా మొదలు తూనే ఉన్నాయి. తాజాగా… కొన్ని రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ అమల్లో ఉండ డం, తెలంగాణలోనూ క్రమంగా కేసులు పెరుగుతుండడంతో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారా మోనని జనం భయపడిపోతున్నారు. ఈ క్రమంలో ముందుగానే తట్టాబుట్టా సర్దుకుని సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. సొంతూళ్లకు వెళ్లే వలస కార్మికులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.

దేశవ్యాప్తంగా మళ్లీ ఆంక్షలు…
గతేడాది జూన్‌ 1 నుంచి అన్‌లాక్‌ ప్రక్రియను ప్రారం భించిన కేంద్ర ప్రభుత్వం దశలవారీగా దాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఆ తర్వాత వ్యాక్సిన్‌ అందు బాటులోకి రావడంతో కరోనా కేసులు పెరుగుతున్నా క్రమంగా జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. అయితే కొద్ది రోజులుగా మళ్లి దేశంలో కేసుల సంఖ్య పెరుగుతండడంతో ఆయా రాష్ట్రాలు కట్టడి చర్యలు ప్రారంభించాయి. కొన్ని నగరాల్లో నిబం ధనలు కట్టుదిట్టం చేయడంతోపాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నా రు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌కు కేంద్రం సుముఖంగా లేకపోయినా ముఖ్య నగరాలు, పట్టణాల్లో పరిస్థితులను బట్టి మళ్లి ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement