హైదరాబాద్ : దేశంలో పట్టభద్రుల నియోజకవర్డాలలో జరిగిన ఎన్నికలలో బిజెపికి ఎదురుగాలే వీస్తున్నదని టిఆర్ ఎస్ అభ్యర్ధిగా ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించిన పల్లా రాజేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు.. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారణాసిలో బీజేపీకి వ్యతిరేకంగా పట్టభద్రులు తీర్పునిచ్చారు. అలాగే ఆర్ఎస్ఎస్ కు పుట్టినిల్లు అని చెప్పుకునే నాగపూర్‌తో పాటు పుణె, ఔరంగాబాద్‌లో కూడా బీజేపీ అభ్యర్థులు పట్టభద్రుల చేతిలో ఓటమి పాలయ్యారని అన్నారు.. కానీ తెలంగాణ రాష్ర్టంలోఅధికారంలో ఉన్న టిఆర్ ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా పట్టభద్రులు తీర్పు ఇచ్చి తమ విలక్షణత చాటకున్నారని పల్లా పేర్కొన్నారు.. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు జిల్లాల్లో ఉన్న పట్టభద్రులందరూ ఏకపక్షంగా టిఆర్ ఎస్ కి విజయాన్ని అందించి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచారన్నారు. ఆరు సంవత్సరాల టీఆర్ఎస్ పాలనపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయని, అయినప్పటికీ అద్భుతంగా కేసీఆర్ నాయకత్వాన్ని పట్టభద్రులు బలపరిచారు అని ఎమ్మెల్సీ పల్లా పేర్కొన్నారు. తన విజయంలో సహకరించిన మిత్రులకు, నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, ఓట్లు వేసి దీవించిన పట్టభద్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement